Drugs Party: హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ క్రాక్‌డౌన్.. 12 మంది అరెస్ట్
ABN , Publish Date - Jan 07 , 2026 | 08:25 PM
గచ్చిబౌలిలోని కోవ్ స్టేస్ హోటల్లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడులు చేశారు. 12 మందిని పట్టుకున్నారు. అయిదుగురు డ్రగ్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ పార్టీలో పోలీస్ శాఖకు చెందిన అధికార్ని కూడా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్, జనవరి 7: హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని కోవ్ స్టే హోటల్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. సైబరాబాద్ పోలీసులు, ఈగల్ ఫోర్స్ బృందం సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పార్టీలో పాల్గొన్న 12 మందిని అరెస్ట్ చేశారు.
హోటల్ మేనేజ్‌మెంట్‌లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న యువకులు రీయూనియన్ పేరుతో ఈ ప్రైవేట్ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో మేగేందర్, తేజేశ్వర్, రవి, సాయి ప్రసాద్, రమేశ్ అనే ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. అరెస్టయిన వారిలో పోలీస్ శాఖకు చెందిన ఒక ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు సమాచారం.
దీనిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 41/2026 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడకం, పార్టీలపై పోలీసులు కొనసాగిస్తున్న క్రాక్‌డౌన్‌లో ఇది మరో కీలక ఘటనగా మారింది.
హైదరాబాద్లో భారీగా నల్ల బెల్లం పట్టివేత..
హైదరాబాద్ నుంచి అచ్చంపేట్ ప్రాంతానికి తరలిస్తున్న నల్ల బెల్లాన్ని హైదరాబాద్ శివారులో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ శాఖ దాడిలో 900 కేజీల బెల్లాన్ని ,50 కేజీల అలమ్ స్వాధీనం చేసుకుని, శంకర్ అలియాస్ సాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పట్టుకున్న బెల్లం విలువ రూ. 95 వేలు వరకూ ఉంటుందని అంచనా.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్
For More TG News And Telugu News