Municipal Elections In TG: మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
ABN , Publish Date - Jan 07 , 2026 | 07:06 PM
తెలంగాణా వ్యాప్తంగా గతేడాది డిసెంబర్‌లో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. తాజాగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకూ సన్నాహాలు చేస్తోంది.
హైదరాబాద్, జనవరి 07: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. తాజాగా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) కసరత్తు చేస్తోంది. అందుకోసం బుధవారం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధిరులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 12లోగా ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఈ సందర్భంగా ఆయా అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. అలాగే జనవరి 13న టీ పోల్(T-POLL) యాప్‌లో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఇక.. జనవరి 16న పోలింగ్ స్టేషన్ల వారీగా.. ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని సూచించింది.
బ్యాలెట్ బాక్సులు, అవసరమైన సామగ్రి సిద్ధం చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఎస్ఈసీ ఆదేశించింది. ఇక 2019 నాటి ఓటర్ల జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది. పోలింగ్ స్టేషన్లలో బీఎల్‌వోల ద్వారా ఓటర్ల వివరాలను పరిశీలన చేయాలని సూచించింది. ఆన్‌లైన్‌లో కూడా ఓటరు నమోదు, మార్పులకు అవకాశమిచ్చిందని వివరించింది. ఎఫ్ఎస్‌టీ, ఎస్ఎస్‌టీ బృందాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలని జారీచేసిన ఆదేశాల్లో ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.
2026 జనవరి 12 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ
2026 జనవరి 13 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలన ప్రారంభం
2026 జనవరి 16 ఓటరు జాబితా విడుదల చేయాలని ఆదేశం
రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది డిసెంబర్‌లో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవంతంగా నిర్వహించింది. తాజాగా.. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టింది. అందుకోసం జిల్లా, మున్సిపల్ ఉన్నతాధికారులతో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయని ఒక చర్చ సైతం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: లోకేశ్
కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్
For More TG News And Telugu News