Hyderabad Gun Case: లైసెన్స్ లేకుండా తుపాకీ.. వ్యక్తి అరెస్ట్
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:02 AM
హైదరాబాద్ పాతబస్తీలో తుపాకీ కలకలం రేపింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా నాటు తుపాకీ లభించింది.
హైదరాబాద్, జనవరి 2: నగరంలోని పాతబస్తీలో (OLd City) అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనిఖీ చేయగా అతడి వద్ద లభించిన వస్తువును చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. అసలు అది ఆ వ్యక్తి వద్దకు ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ పాతబస్తీలో పోలీసులకు పట్టబడిన వ్యక్తి వద్ద ఏం లభించిందో ఇప్పుడు తెలుసుకుందాం. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో నాటు తుపాకీ కలకలం రేపింది.
తుపాకీతో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి హుస్సేని ఆలం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. డౌట్ వచ్చిన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి వద్ద తూటాలు లేని నాటు తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు... వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు చార్మినార్‌లోని గాజుల వ్యాపారి హబీబ్ ఖాన్ కుమారుడు అమ్జద్ ఖాన్(29) గా గుర్తించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా నాటు తుపాకీని అమ్జద్ క్యారీ చేస్తున్నాడు.
దీంతో తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు... అమ్జద్‌పై ఆయుధాల చట్టం సెక్షన్ 25(1-B)(a) కింద కేసు నమోదు చేశారు. అసలు తుపాకీని ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు?.. అమ్జద్‌కు ఎవరు ఇచ్చారు?.. తుపాకీని ఎందుకు తీసుకున్నాడు? ఇలా వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాతబస్తీలో ఓ వ్యక్తి వద్ద తుపాకీ లభించడం స్థానికంగా సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి...
గ్రేటర్‌లో మార్చి నాటికి 20 కొత్త సబ్ స్టేషన్లు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. ఎందుకంటే?
Read Latest Telangana News And Telugu News