Hyderabad: గ్రేటర్‌లో మార్చి నాటికి 20 కొత్త సబ్ స్టేషన్లు
ABN , Publish Date - Jan 02 , 2026 | 08:35 AM
విద్యుత్ అవసరాలు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో హైదరాబాద్ మహానగరంలో కొత్తగా మరో 20 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు.
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లో భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా ఈ ఏడాది మార్చి నాటికి 20 కొత్త సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌పంపిణీ సంస్థ(Southern Telangana Power Distribution Company) చర్యలు చేపట్టింది. మాస్టర్‌ప్లాన్ జోన్‌లో షాపూర్‌నగర్, సాయినగర్, అంతాయిపల్లి, వీబీ సిటీ, భవానీనగ ర్, ప్రైడ్ ఇండియాకాలనీ, అత్తాపూర్ ప్రాంతాల్లో 7 కొత్త సబ్‌స్టేషన్లు, రంగారెడ్డి జోన్ పరిధిలో ముర్తుజాగూడ, మోకిల, కోహెడ, కొంగర కలాన్, చెరుకుపల్లి, కలకొండ, రామానుజపూర్‌తోపాటు మేడ్చల్ జోన్‌లో రావల్ కోల్, మేడిపల్లి,

బోడుప్పల్ (యాదాద్రికాలనీ), వెంకటాపూర్ మియాపూర్(Venkatapur Miyapur) (వాసవీనగర్), శంబీపూర్ ప్రాంతాల్లో 33/11 కేవీ కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ముర్తుజాగూడ, షాపూర్‌నగర్‌లో సబ్‌స్టేషన్లు చార్జింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్న 20 ప్రాంతాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు 33 కేవీ యూజీ కేబుల్, 11 కేవీ యూజీ కేబుల్, కేబుల్ స్టెంజ్, స్విచ్ గేర్‌వంటి పనులు పూర్తిచేసినట్లు డిస్కం అధికారులు చెబుతున్నారు. సమ్మర్‌యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులన్నీ జనవరి 31 నాటికి పూర్తిచే యాలని సర్కిళ్ల అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం
Read Latest Telangana News and National News