Fake Baba Cheated On Young Woman: మంత్రం వేస్తానంటూ.. యువతిని ముగ్గులోకి దించిన ఫేక్ బాబా
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:33 AM
ఓ యువతిని ఫేక్ బాబా మోసగించాడు ఈ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని నవాబ్ సాహెబ్ కుంటలో జరిగింది. ఈ కేసుకి సంబంధించిన వివరాలను పాతబస్తీ పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్, అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి): ఓ యువతి (Young Woman)ని ఫేక్ బాబా (Fake Baba) మోసగించాడు ఈ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని నవాబ్ సాహెబ్ కుంటలో జరిగింది. ఈ కేసుకి సంబంధించిన వివరాలను పాతబస్తీ పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని నవాబ్ సాహెబ్ కుంటలో నివసించే కుటుంబానికి చెందిన ఒక యువతి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఇదే అదునుగా భావించిన నకిలీ బాబా వారి కుటుంబాన్ని మోసం చేశాడు.
యువతికి మంత్రించి బాగుచేస్తానని చెబుతూ ఓ బాబా రోజూ ఇంటికి వచ్చేవాడు. మంత్రాలు వేస్తే ఆరోగ్యం మెరుగవుతుందనే నమ్మకంతో తల్లిదండ్రులు ఆ యువతిని ఆయన వద్దకు తరచూగా పంపించారు. ఒక దశలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యువతిని దర్గాలో మంత్రిస్తే పూర్తిగా కోలుకుంటుందని నమ్మించి ఆమెను తీసుకెళ్లి తనతో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాతబస్తీ పోలీసులను ఆశ్రయించారు. యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇంతలో యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడింది. తాను మేజర్‌ని అని, ప్రేమించి స్వచ్ఛందంగా బాబాని వివాహం చేసుకున్నానని చెప్పింది. అంతేకాదు సమయం, సందర్భం చూసుకుని నిర్ణయం తీసుకున్నానని, అంతా తన ఇష్టపూర్వకంగానే జరిగిందంటూ క్లారిటీ ఇచ్చింది. యువతి స్వచ్ఛందంగా వెళ్లిందని తెలిసిన వెంటనే మిస్సింగ్ కేసును పాతబస్తీ పోలీసులు క్లోజ్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాబాకి ఇది వరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. తమ కూతురు తిరిగి తమ దగ్గరికి రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మాయ మాటలు చెప్పి మంత్రాల పేరిట యువతిని ప్రభావితం చేసిన బాబాని కఠినంగా శిక్షించాలని యువతి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
24 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు టు కిమ్స్..
అడ్లూరిపై వ్యాఖ్యల ఎఫెక్ట్... పొన్నం ఇంటి వద్ద భద్రత పెంపు
Read Latest Telangana News And Telugu News