Share News

Dalit Protests: అడ్లూరిపై వ్యాఖ్యల ఎఫెక్ట్... పొన్నం ఇంటి వద్ద భద్రత పెంపు

ABN , Publish Date - Oct 08 , 2025 | 09:10 AM

అడ్లూరికి క్షమాపణ చెప్పకపోతే పొన్నం ఇంటిని ముట్టడిస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. ఈక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద భద్రత పెంచారు. పొన్నం ఇంటి ముందు బారికేడ్స్‌ను ఏర్పాటు చేశారు పోలీసులు.

Dalit Protests: అడ్లూరిపై వ్యాఖ్యల ఎఫెక్ట్... పొన్నం ఇంటి వద్ద భద్రత పెంపు
Dalit Protests

కరీంనగర్, అక్టోబర్ 8: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై (Minister Adluri Laxman) మరో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. పొన్నం వ్యాఖ్యలను లక్ష్మణ్ తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే దళిత సంఘాలు కూడా మండిపడుతున్నాయి. అడ్లూరి లక్ష్మణ్‌కు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అడ్లూరికి క్షమాపణ చెప్పకపోతే పొన్నం ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. పొన్నం ఇంటి ముందు బారికేడ్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


కాగా.. ఈనెల 5న జూబ్లీహిల్స్ నియోజవర్గంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావడం ఆలస్యమైంది. ఈ క్రమంలో అడ్లూరిని ఉద్దేశించి పొన్నం పలు వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉండటంతో ఆవి కాస్తా బహిర్గతమయ్యాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై మంత్రి అడ్లూరి స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తన బాడీ షేమింగ్‌పై పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందే అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.


మరోవైపు తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం కాస్తా ముదరడంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరు మంత్రులతో మాట్లాడి.. ఇలాంటి వ్యవహారాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయని... ఇద్దరు కలిసి ముందుకు వెళ్లాలని మహేష్ గౌడ్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

24 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు టు కిమ్స్‌..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 09:43 AM