Home » Telangana » Karimnagar
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు విడుదలయ్యే అవకాశాలు ఉండడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొన్నది. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివిధ వర్గాల ప్రజలను, కుల సంఘాల నాయకులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అడుగుతున్నారు. గత ఏడాదిన్నరగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. మొదటి, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఇచ్చారు.. ఇదే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొన్ని పూర్తిచేసి పంపిణీ చేయగా, మరికొన్ని నిర్మాణ దశలో అసంపూర్తిగా మిగిలిపోయాయి. వీటిని కూడా బీఎల్సీ( బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో పూర్తిచేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుట్టుచప్పుడు కాకుండా ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రయాణికులపై భారం మోపింది. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా కరీంనగర్-1, కరీంనగర్-2, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వేములవాడ, గోదావరిఖని, మంథని, హుస్నాబాద్, హూజూరాబాద్ డిపోలు ఉన్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ రేట్లను పెంచడంతో తెలంగాణరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా టోల్ ప్లాజా యూజర్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను అటవీ శాఖ అధికారులు ప్లాంటేషన్ కోసం సర్వే చేయడం సరికాదని పోడు రైతులు మండిపడ్డారు.
జగిత్యాల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు సాగు ఖర్చుల నిమిత్తం రైతు భరోసా పథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో ఈనెల 17వ తేదీన 1,79,820 మంది రైతుల ఖాతాల్లో రూ.120,67,49,510 జమ అయ్యాయి. వానాకాలం సాగుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ప్రత్యర్థి దేశాలతో యుద్ధం చేసే సమయంలో వ్యవహరించే విధంగానే వేములవా డ ప్రధాన రహదారి విస్తరణ నిర్వాసితులతో అధికారులు వ్యవ హరిస్తున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు విద్యా సంస్థలపై దాడులు చేస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు.
తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కరకవేణి కుంటయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
అక్రమ స్థలాల క్రమబద్ధీకరణకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)కు గడువును మరోసారి పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30 వరకు ఎల్ఆర్ఎస్ చేసుకునే వారికి ఫీజులో 25శాతం రాయితీని కొనసాగిస్తూ మరో అవకాశం కల్పించింది.
వానాకాలం పంటల సాగుకు భరోసా అందిస్తూ పెట్టుబడి సాయం డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. తొమ్మిది రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. తొలి విడత డబ్బులు ట్రెజరీకి చేరడంతో పాటు రైతు ఖాతాల్లోనూ జమ కావడం మొదలైంది. రైతు భరోసా విడుదల కావడంతో జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.