Share News

పక్కాగా సాగు లెక్కలు

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:45 AM

సాగు లెక్కలు పక్కాగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటల నమోదు ద్వారా రైతులకు బహూళ ప్రయోజనాలు చేకూర్చే దిశగానే కేంద్రం డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విధానాన్ని తీసుకవచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ పంటల సర్వేను వేగవంతంగా పూర్తి చేసే చర్యలు మొదలుపెట్టింది.

పక్కాగా సాగు లెక్కలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సాగు లెక్కలు పక్కాగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటల నమోదు ద్వారా రైతులకు బహూళ ప్రయోజనాలు చేకూర్చే దిశగానే కేంద్రం డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విధానాన్ని తీసుకవచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ పంటల సర్వేను వేగవంతంగా పూర్తి చేసే చర్యలు మొదలుపెట్టింది. గతంలోనే డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ పద్ధతి ముందుకు వచ్చినా క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో ముందుకు సాగలేదు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ సర్వే పూర్తి చేయడానికి వలంటీర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం క్లస్టర్ల వారీగా వలంటీర్లను నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 65 క్లస్టర్ల ద్వారా సర్వే కోసం క్లస్టర్‌కు ఒకరి చొప్పున వలంటీర్లను నియమించారు. వలంటీర్లకు శిక్షణ అందించి 45 రోజుల్లో సర్వే పూర్తిచేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 4.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌లో 1.98 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు చేశారు. యాసంగి సీజన్‌ సంబంధించి పంటల సాగుపై సమగ్ర సమాచారం సేకరిస్తారు. ఖచ్చితమైన వివరాల కోసం ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. మొబైల్‌ యాప్‌ను ఉపయోగించి వలంటరీ పొలం వద్దకు వెళ్లి నేరుగా పంటల ఫొటోలు తీసి మొబైల్‌ యాప్‌ ద్వారా అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు ఒక వలంటీర్‌ దాదాపు 750 నుంచి వెయ్యి సర్వే నంబర్లను కవర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒక రైతు వివరాలు అప్లోడ్‌ చేయడం ద్వారా వలంటీర్‌కు ఏడు రూపాయలు చెల్లిస్తుంది. ఒక వలంటీర్‌ రోజుకు రూ.1200 సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. వలంటీర్‌గా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అర్హత కలిగిన వారితో పాటు బీఎస్సీ అగ్రికల్చర్‌ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ, వ్యవసాయ విస్తరణాధికారుల పర్యవేక్షణలో పనిచేస్తారు. ఇందుకోసం జిల్లాలో 65 మంది వలంటీర్లను నియమించారు.

డిజిటల్‌ సర్వే ప్రయోజనాలు

డిజిటల్‌ సర్వే ద్వారా రైతులు ఏ పంటలు సాగు చేశారో రికార్డు అవుతుంది. ప్రభుత్వం నుంచి అందించే పథకాల్లో నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. రైతులు, పంట నష్టం పరిహారం, రైతు భరోసా, ఇతర పథకాలు అందించే సమయంలో డిజిటల్‌ సమాచారం కీలకంగా పనిచేస్తుంది. సాగు లెక్కల్లో పారదర్శకత డిజిటల్‌ సర్వే ద్వారా లభిస్తుంది. డిజిటల్‌ సర్వేను నిర్వహించే వలంటీర్‌ తనకు కేటాయించిన గ్రామంలో ప్రతి సర్వే నంబర్‌లో ఉన్న పొలం వద్దకు వెళ్లి ప్రభుత్వ అందించే డిజిటల్‌ క్రాప్‌ సర్వే యాప్‌ ద్వారా పంట ఫొటోలను తీసి పంట రకం, సాగు విస్తీర్ణం, నీటిపారుదల సౌకర్యం వంటి వివరాలను జియో ట్యాగింగ్‌ ద్వారా నమోదు చేస్తారు.

జిల్లాలో యాసంగి సాగు

జిల్లాలో యాసంగిలో 1.98 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి 1.83 ఎకరాల్లో సాగు చేసే విధంగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. మొక్కజొన్న 2,135 ఎకరాలు, నువ్వులు 490 ఎకరాలు, పొద్దుతిరుగుడు 1,107 ఎకరాలు, కందులు 375 ఎకరాలు, వేరుశనగ 35 ఎకరాలు, పెసర 81ఎకరాలు, చెరుకు 20ఎకరాలు, జొన్న 4ఎకరాలు, ఇతర పంటలు 6,745 ఎకరాల్లో సాగు అంచనాల లెక్కలు డిజిటల్‌ లెక్క ద్వారా తెలియనున్నది.

గత ఏడాది పైలట్‌ ప్రాజెక్టుగా సర్వే..

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం ఫిబ్రవరిలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా 52 క్లస్టర్‌లలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేశారు. ప్రభుత్వం మండల విస్తరణ అధికారులతో సర్వేను చేయించింది. వివిధ పంటల సాగు వివరాలను ఫోన్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ సర్వేలో జిల్లాకు 1,43,936 మంది రైతులకు సంబంధించి 95,443 ఎకరాల్లో సర్వే చేసే విధంగా లక్ష్యంగా చేశారు. జిల్లాలో డిజిటల్‌ సర్వేలో గంభీరావుపేట మండలంలో గంభీరావుపేటలో 5,002 మంది రైతులు 2,094 ఎకరాలు, లింగన్నపేట 4,067 మంది రైతులు 2,089 ఎకరాలు, నర్మాల 5,106 రైతులు 2,098 ఎకరాలు, సముద్రలింగాపూర్‌ 3,168 రైతులు 2,099 ఎకరాలు, ఇల్లంతకుంట మండలం దాచారం 2,015 రైతులు 1,854 ఎకరాలు, ఇల్లంతకుంటలో 2,414 రైతులు 1,842 ఎకరాలు, గాలిపల్లిలో 2,543 రైతులు 1,838 ఎకరాలు, పెద్దలింగాపూర్‌ 3,379 రైతులు 1,832 ఎకరాలు, పొత్తూర్‌ 2,902 రైతులు 1,847 ఎకరాలు, రేపాక 3,669 రైతులు 2,098 ఎకరాలు, వల్లంపట్ల 3,235 రైతులు 1,841 ఎకరాలు, ముస్తాబాద్‌ మండలం అవునూర్‌లో 3,079 రైతులు 1,851 ఎకరాలు, బందనకల్‌ 2,719 రైతులు 2,099 ఎకరాలు, చీకోడు 3,125 రైతులు 2,089 ఎకరాలు, మద్దికుంట 1,880 రైతులు 1,849 ఎకరాలు, ముస్తాబాద్‌ 2,733 రైతులు 1,848 ఎకరాలు, నామపూర్‌ 2,446 రైతులు 1,849 ఎకరాలు, సిరిసిల్ల అర్బన్‌ మండలం బోనాలలో 2,900 రైతులు 2,099 ఎకరాలు, సిరిసిల్ల 3,822 రైతులు 1,852 ఎకరాలు, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి 3,501 రైతులు 2,100 ఎకరాలు, జిల్లెల్ల 3,326 రైతులు 1,848 ఎకరాలు, కస్బెకట్కూర్‌ 2,531 రైతులు 1,839 ఎకరాలు, నేరెళ్ల 2,657 రైతులు 1,843 ఎకరాలు, తాడూర్‌ 3,148 రైతులు 2,097 ఎకరాలు, తంగళ్లపలి 4,005 రైతులు 2,094 ఎకరాలు, వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో 2,933 రైతులు 2,103 ఎకరాలు, వీర్నపల్లి 2,684 రైతులు 2,099 ఎకరాలు, ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌ 2,336 రైతులు 1,849 ఎకరాలు, గొల్లపల్లిలో 2,737 రైతులు 2,094 ఎకరాలు, వెంకటాపూర్‌లో 3,842 రైతులు 1,846 ఎకరాలు, బోయినపల్లి మండలం కొదురుపాకలో 3,125 రైతులు 1,845 ఎకరాలు, బోయినపల్లిలో 2,816 రైతులు 1,849 ఎకరాలు, కోరెం 3,657 రైతులు 2,091 ఎకరాలు, విలాసాగర్‌లో 2,857 రైతులు 1,839 ఎకరాలు, చందుర్తి మండలం బండపల్లిలో 2,231 రైతులు 1,843 ఎకరాలు, మల్యాల 1,748 రైతులు 2,085 ఎకరాలు, మర్రిగడ్డ 2,352 రైతులు 2,098 ఎకరాలు, కోనరావుపేట మండలం బావుసాయిపేటలో 2,565 రైతులు 1,843 ఎకరాలు, కొలనూర్‌ 2,637 రైతులు 2,097 ఎకరాలు, కోనరావుపేట 3,060 రైతులు 2,096 ఎకరాలు, నిమ్మపల్లి 2,077 రైతులు 1,847 ఎకరాలు, నిజామాబాద్‌ 2,211 రైతులు 1,848 ఎకరాలు, సుద్దాల 2,775 రైతులు 1,847 ఎకరాలు, రుద్రంగి మండలంలో మానాల 1,381 రైతులు 1,353 ఎకరాలు, వేములవాడ మండలం నాంపల్లిలో 3,077 రైతులు 2,095 ఎకరాలు, శాత్రాజుపల్లి 2,688 రైతులు 2,094 ఎకరాలు, వేములవాడ రూరల్‌ మండలంలో బొల్లారం 2,908 రైతులు 1,847 ఎకరాలు, మర్రిపల్లి 3,752 రైతులు 1,850 ఎకరాలు, వట్టెంల 2,075 రైతులు 2,093 ఎకరాల్లో సర్వే చేశారు.

Updated Date - Feb 22 , 2026 | 12:45 AM