Home » Peddapalli
కరీంనగర్ సమీపంలో 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) ఉంది. అది ప్రస్తుతం పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటితో కళకళలాడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నగర ప్రజలకు తాగునీరు పుష్కలంగా సరఫరా కావాలి.
పంచాయతీ ఎన్నికల ఊపుతో పల్లెలు గమ్మత్తుగా ఊగిపోయాయి. షెడ్యూల్ వచ్చి మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మందు, విందు దావతులతో జోష్‌గా పల్లెలు మునిగిపోయాయి. ఎన్నికలు ముగిసిన గెలిచిన ఉత్సాహంలో కొందరు, ఓడిన బాధలో మరికొందరు ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచుతున్నారు.
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. అత్యధిక బీసీలు గెలిచిన జిల్లాల్లో పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 2019లో జరిగిన ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 21 స్థానాలను అదనంగా దక్కించుకున్నారు.
రామగుండం పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అసంపూర్తిగా వదిలేసిన పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
జిల్లాలోని మానేరు నదిపై గత ప్రభుత్వ హయాంలో డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన చెక్‌డ్యాంలు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరపాలని టీపీసీసీ ఎన్నికల కమిషన్ సభ్యులు శశిభూషణ్ కాచె, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, కలెక్టర్‌ను కోరారు.
మంథని మండలంలోని ఆరెంద గ్రామ శివారులో ఉన్న మానేరు నది పై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి రూ.203 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు శనివారం తెలిపారు.
యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతర మని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద ఎరువుల దుకాణాన్ని సందర్శించారు. యూరియా బుకింగ్ యాప్ గురించి తెలుసుకున్నారు.
ఐదు రోజులుగా మేడిపల్లి ఓపెన్‌కాస్టు శివారులో సంచరించిన పులి శుక్రవారం మల్యాలపల్లి శివారులో కనిపించింది. మల్యాలపల్లి గ్రామానికి చెందిన కొమురమ్మ మేకలను మేపడానికి వెళ్లగా పెద్దపులి కనిపించిందని, ఆమె కేకలు పెడుతూ గ్రామానికి చేరుకొని ప్రజలకు తెలపడంతో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలించగా పులి అడుగులు గుర్తించారు.
సింగరేణి ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు యాజమాన్యం నిధుల కేటాయింపులో కోత విధిం చడం సరికాదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్ర వారం ప్రెస్‌భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వేడుకల నిర్వహణకు 40 లక్షలకు పైగా వెచ్చించే వారని, ఈ ఏడాది 8లక్షలు కేటాయించడం సమంజసం కాదన్నారు.
ప్రజాభిప్రా య సేకరణలో ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్క రిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని జేఎన్టీయూ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పర్యా వరణ ప్రజాభి ప్రాయ సేకరణలో ఆయన మాట్లాడారు.