ముఖ్యమంత్రిని కలిసిన రామగుండం కార్పొరేటర్లు
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:30 AM
రామగుండం నగర పాలక సం స్థకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆదివారం ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు, ఇద్దరు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
కోల్‌సిటీ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): రామగుండం నగర పాలక సం స్థకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆదివారం ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు, ఇద్దరు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఒక్కొక్కరిని ముఖ్యమంత్రికి పరిచయం చేయించారు. రామగుండంలో కాంగ్రెస్ విజయంపై రేవం త్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో రాజ్‌ఠాకూర్ నాయక త్వంలో అందరూ సమిష్టిగా పని చేయాలని, ప్రజల కనీస అవసరాలైన పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాల సమస్యలను పరిష్కరించాలని, ప్రజల్లో ఉండి పారదర్శకమైన పాలన అందించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మరింతగా పేరు తేవాలన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ కూడా ఉన్నారు.