Home » Sircilla
గోదావరినది దాటి రామగుండం వైపు వచ్చిన పెద్దపులి ఎట్టకేలకు వారం రోజుల తరువాత తిరిగి గోదావరిదాటింది. సోమవారం రాత్రి గోదావరినది దాటి మంచిర్యాల జిల్లా రామారావుపేట ఓపెన్‌కాస్టు వైపు వెళ్టినట్టు ఫారెస్టు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరినదిలో పులి పాదముద్రలను గుర్తించారు.
గ్రామాలాభివృద్ధికి పంచాయతీల పాలకవర్గ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులను శ్రీశివకిరణ్ గార్డె న్స్లో మంగళవారం సన్మానించారు.
సుల్తా నాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా రహదారుల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకు ఆరు కోట్ట రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.
జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకో వాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారు లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో మాదకద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహిం చారు.
గోదావరిఖనిలో కూల్చి వేతలను నిరసిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును జిరాంజీ ఉపాధి పథకంగా పేరు మార్చడం దుర్మార్గమని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. ఇం దుకు నిరసనగా సోమవారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చట్టం ప్రతులను దహనం చేశారు.
విద్యార్థులు ఒక ఆశయాన్ని ఏర్పరచుకొని కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను సాకారం చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం ఎమ్మెల్యే సొంత ఖర్చుతో 45 రోజుల పాటు మధ్యాహ్న భోజనాన్ని సోమవారం ప్రారంభించారు.
జాతీయ సంపద అయిన బొగ్గు గనులను ప్రభుత్వ నడపకుండా ప్రైవేటు వారికి కట్టబెట్టేలా తెచ్చిన వేలం పాటల వల్ల సింగరేణికి, కోల్ ఇండియాకు భవిష్యత్తు లేకుండా అవుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మణుగూరులోని పీకే ఓసి డిసైడ్ ఎక్స్టెన్షన్ 2బ్లాక్‌ను వేలం పాటలో పెట్టారన్నారు.
కరీంనగర్ సమీపంలో 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) ఉంది. అది ప్రస్తుతం పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటితో కళకళలాడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నగర ప్రజలకు తాగునీరు పుష్కలంగా సరఫరా కావాలి.
కొత్త మండలాలు, డీసీసీబీల ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణకు సర్కారు కసరత్తు చేస్తోంది. జిల్లాలో 12 కొత్త సొసైటీలను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.