ఒకే ఇంట్లో 22 ఓట్లు
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:36 AM
సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని 9వ వార్డు నుంచి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలైన బీఆర్‌ఎస్ అభ్యర్థి సూర శ్యామ్ అన్నారు. ఆదివారం విలేకరుల సమావే శంలో మాట్లాడుతు 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి నంబరుపైన 22 ఓట్లు నమోదు చేయించారన్నారు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని 9వ వార్డు నుంచి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలైన బీఆర్‌ఎస్ అభ్యర్థి సూర శ్యామ్ అన్నారు. ఆదివారం విలేకరుల సమావే శంలో మాట్లాడుతు 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి నంబరుపైన 22 ఓట్లు నమోదు చేయించారన్నారు. ఈ విషయాన్ని అధికారులకు తెలిపా మని, ప్రజావాణిలో కలెక్టర్‌కు సమర్పించినా అధికారులు చర్యలు తీసు కోలేదన్నారు. ఫలితంగా తాను నాలుగు ఓట్లతో ఓటమి పాలయ్యాయని అన్నారు ఒకే ఇంటిలో 22 ఓట్లు ఎలా ఉంటాయో అధికారులు చెప్పాల న్నారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్, హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. నాయకులు కొయ్యడ అజయ్, ఆక్బర్, మోసిన్,ఫయాజ్,అనిల్, కాళీచరణ్, వెంకటేశ్, రాజు, రాకేష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.