Share News

గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రోత్సాహం

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:39 PM

గ్రామీణ ప్రాంత క్రీడా కారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ క్రీడలను నిర్వ హిస్తుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్కపాక సురేష్‌ అన్నారు. సుల్తానాబాద్‌ జూనియర్‌ కళాశాల మైదానంలో శనివారం సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడలను ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రోత్సాహం

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత క్రీడా కారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ క్రీడలను నిర్వ హిస్తుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్కపాక సురేష్‌ అన్నారు. సుల్తానాబాద్‌ జూనియర్‌ కళాశాల మైదానంలో శనివారం సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతు గ్రామీణ క్రీడాకారులను ప్రొత్సహించేందుకు ఆటల పోటీలు నిర్వహిస్తు వారిలో క్రీడా ఆసక్తిని పెంపొందిస్తున్నామన్నారు. క్రీడల ద్వారా శారీరకంగా దృఢ త్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని, మంచి క్రమశిక్షణ, ఐక్యత నెల కొంటుందన్నారు. అథ్లెటిక్స్‌లో వంద, రెండు వందల మీటర్ల విభాగాలు, లాంగ్‌ జంప్‌తో పాటు వివిధ కేటగిరీలలో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. మండల విద్యాధికారి ఆరెపల్లి రాజయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ టి రమేష్‌, స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్‌, రాష్ట్ర వ్యాయామ ఉపాద్యాయుల అసోసియోషన్‌ బాధ్యులు శోభారాణి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు దాసరి రమేష్‌, కార్యదర్శి వేల్పులు సురేందర్‌, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి తాండ్ర ప్రణయ్‌, ప్రసాద్‌, శ్రీవాణి, వెంకటేశ్‌, విష్ణు, జావిద్‌, మాధవి పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 11:39 PM