Share News

ప్రజాపాలనకు మున్సిపల్‌ ఫలితాలే నిదర్శనం

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:41 PM

కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్‌ పార్టీ ప్రజాపాలనకు అద్దం పడుతాయని ఐఎన్‌టియుసి జనరల్‌ సెక్రటరీ జనక్‌ప్రసాద్‌ అన్నారు. శనివారం సెంటినరీకాలనీ ఐఎన్‌టియుసి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజాపాలనకు మున్సిపల్‌ ఫలితాలే నిదర్శనం

రామగిరి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్‌ పార్టీ ప్రజాపాలనకు అద్దం పడుతాయని ఐఎన్‌టియుసి జనరల్‌ సెక్రటరీ జనక్‌ప్రసాద్‌ అన్నారు. శనివారం సెంటినరీకాలనీ ఐఎన్‌టియుసి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోల్‌బెల్టు పరిఽధి లోని 10 మున్సిపాలిటీలలో 9 స్థానాలను, కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం సింగరేణి కార్మికుల విశ్వాసానికి నిదర్శనం అన్నారు. 16న జరగనున్న మేయర్‌ ఎన్నికల్లో అన్ని మేయర్‌ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ విజయానికి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేల నాయకత్వమే కారణమని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి 15 శాతం ఓట్లు రాలేదని గుర్తు చేశారు. ఐఎన్‌టి యుసి జాతీయ అధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి సూచన మేరకు కార్యకర్తలు ఎన్నికల్లో మద్దతు అందించారన్నారు. ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు కొట రవీం దర్‌రెడ్డి, సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్లు నరసింహరెడ్డి, ధర్మపురి, నాయకులు వికాస్‌కుమార్‌, సందానందం, సత్యనారాయణరెడ్డి, ఆరెపల్లి శ్రీనివాస్‌, వెంకటస్వామి, కుమార్‌, జూబేర్‌,ఉడుత శంకర్‌, కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 11:41 PM