హరహర మహదేవ శంభోశంకర..
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:25 AM
ఓం నమః శివాయ... హర హర మహదేవ నామస్మరణతో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. ఆదివారం మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నుంచే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. గోదావరి నదీ స్నానాలు ఆచరించారు. పలు ఆలయాల్లో శివ కల్యాణాలను నిర్వ హించారు. భక్తులు కల్యాణాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మంథని, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఓం నమఃశివాయ.. అంటూ ఆది వారం మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే గోదావరి నది స్నానాలు, శివాలయాల్లో అభిషేకాలకు భక్తులు పోటెత్తారు. మంథని, కమాన్‌పూర్, ముత్తారం, రామగిరి, మల్హర్ మండలాల భక్తులు తరలివచ్చి పుణ్య స్నానమాచరించారు. భక్తులకు కాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆల్పాహారాన్ని పంపిణీ చేశారు. భిక్షేశ్వరాలయంలో స్వామివారికి ఏకాదశ మహాన్యాసక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శ్రీలేశ్వర-సిద్ధేశ్వర, ఓంకారేశ్వర, వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాల్లో శివ పార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బం దులు కల్గుకుండా రాధాకిషన్‌రావు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): జయ్యారం శివభక్త మార్కండేయ ఆలయం, కుక్కలగూడూర్ త్రిశక్తి అమ్మవారు ఆలయంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. బసంత్‌నగర్ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం పూజ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్ వేము నూర్ పంప్‌హౌజ్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ దంపతులు పూజలు చేశారు బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో అలా్ట్రటెక్ సిమెంట్ యాజమా న్యం రాగి జావా, మజ్జిగ పంపిణీ చేసింది. సర్పంచ్ పర్శవేణి శ్రీనివాస్ యాదవ్, నాయకులు, ఎస్‌ఐ శ్రీధర్ పాల్గొన్నారు.
కోల్‌సిటీటౌన్, (ఆంధ్రజ్యోతి): గోదావరిఖనిలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున 3గంటల నుంచి శివాలయాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శివాల యాల్లో దర్శనం చేసుకున్నారు. కోదండ రామాలయంలోని శివాలయంలో అర్చకులు అత్తెణ చంద్రశేఖరశర్మ మంత్రోచ్చరణల మధ్య పూజలు జరి గాయి. అర్ధరాత్రి లింగోద్భవ కార్యక్రమం సందర్భంగా అభిషేకాలు చేశారు. జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. మార్కండేయకాలనీలోని శివాలయంలో మహాశివ రాత్రి వేడుకలు నిర్వహించారు. పవర్‌హౌస్‌కాలనీలోని కాశీ విశ్వేశ్వరాల యంలో అర్చకులు వొజ్జల వెంకటేశ్వరశర్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు చేశారు. కోదండ రామాలయం శివాలయం ఆవరణలో ఏర్పా టు చేసిన కళ్యాణవేదికపై శివపార్వతుల కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. మార్కండేయకాలనీలోని శివాలయంలో రాత్రి శివపార్వ తుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): భ్రమరాంబ మల్లికార్జునస్వామి, పొత్కపల్లి రాజా వేణుగోపాలస్వామి, మహాలింగేశ్వర స్వామి ఆలయంలో డీసీపీ రాంరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలయంలో రథోత్సవం వైభవంగా నిర్వ హించారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివలింగానికి భక్తులు బిల్వపత్రి సమర్పించారు. మల్లన్న ఆలయంలో కళాకారులు భక్తి పాటలు, నృత్యాలు ఆలరించాయి. అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు, ఈవో సదయ్య, చైర్మన్ మొండయ్య, నాయకులు మూల ప్రేమ్‌సాగర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, పాల్గొన్నారు.
ముత్తారం, (ఆంధ్రజ్యోతి): మచ్చుపేట అటవీ ప్రాంతంలో వెలసిన బగులగుట్ట ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పర్యవేక్షణలో, మంథని సీఐ రాజు, ఎస్సై రవికుమార్ భద్రతా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణతోపాటు గుట్టపైకి వెళ్లే మార్గాల్లో సౌకర్యాలు కల్పించారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): రచ్చపల్లి సాంబమూర్తి ఆలయంతో పాటు మేడారంలోని ఆమరేశ్వస్వామి ఆలయం, ధర్మారంలోని భక్త మార్కండేయ ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రచ్చపల్లిలో రథోత్సవం కన్నుల పండగగా జరిగింది. నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి మట్ట సరిత, ధర్మారం ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌లు దర్శించుకున్నారు.