Share News

ఖని ఆసుపత్రిలో సకాలంలో అందని వైద్యం

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:37 PM

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రునికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారు. దాదాపు రెండు గంటల పాటు క్షతగాత్రుడు విలవిలలాడాడు. రోగి అవస్థను చూసి అక్కడ ఉన్న మిగతా వారు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖని  ఆసుపత్రిలో సకాలంలో అందని వైద్యం

కళ్యాణ్‌నగర్‌, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రునికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారు. దాదాపు రెండు గంటల పాటు క్షతగాత్రుడు విలవిలలాడాడు. రోగి అవస్థను చూసి అక్కడ ఉన్న మిగతా వారు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖని శాంతినగర్‌కు చెందిన జెల్ల సమ్మయ్య భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం గాంధీనగర్‌లో ఓ ఇంటి పైకప్పు రేకుల నుంచి పడి గాయా లపాలయ్యాడు. అక్కడ పని చేస్తున్న తోటి కార్మికులు ఆసుపత్రికి తర లించారు. సమ్మయ్యకు కాళ్లు, చేతులు, మెడ భాగంలో తీవ్ర గాయా లయ్యాయి. ఎమర్జెన్సీ వార్డులకు తీసుకువచ్చి స్ట్రక్చర్‌పై సుమారు రెండు గంటలపాటు అక్కడే ఉంచారు. ఎక్స్‌రే గది వద్దకు తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించారు. అనంతరం కొత్త బిల్డింగ్‌కు తీసుకువచ్చి ఎక్స్‌రే సరిగా రాలే దంటూ సమ్మయ్యను స్ట్రక్చర్‌పైనే పడుకోబెట్టి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతోపాటు ఇతరులు ప్రశ్నిం చడంతో జూనియర్‌ డాక్టర్లు వచ్చి సమయ్యకు పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించినప్పటికీ వైద్యుల్లో నిర్లక్ష్యం వీడడం లేదు.

Updated Date - Feb 14 , 2026 | 11:37 PM