Share News

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:03 AM

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఏంఎసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం తారుపల్లి మండల పరిషత్‌ ప్రైమరీ పాఠశాలలో కలెక్టర్‌ ప్రత్యేక నిధులతో మంజూరు చేసిన డ్యూయల్‌ డెస్క్‌ బెంచీలను ఆయన ప్రారంభించారు.

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి

కాల్వశ్రీరాంపూర్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఏంఎసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం తారుపల్లి మండల పరిషత్‌ ప్రైమరీ పాఠశాలలో కలెక్టర్‌ ప్రత్యేక నిధులతో మంజూరు చేసిన డ్యూయల్‌ డెస్క్‌ బెంచీలను ఆయన ప్రారంభించారు. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్‌లో మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు.

తారుపల్లి పాఠశాల గతంలో దయనీయ స్థితిలో ఉండేదని, ఎమ్మెల్యే విజయరమణ రావు, కలెక్టర్‌ శ్రీహర్షల ప్రత్యేక చొరవతో పాఠశాలను కార్పొరేట్‌ స్థాయికి దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తామన్నారు. జీపీ ఆవరణలో బోర్‌వెల్‌ పనులను ప్రారంభించారు. సర్పంచ్‌ గాజనవేన సదయ్య, ఎంఈఓ సిరి మల్ల మహేష్‌, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:03 AM