Share News

జాతీయ, సేవాభావాన్ని బలోపేతం చేయాలి

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:54 AM

భారతీయ జనతా పార్టీలో పని చేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జాతీయ భావన, సిద్ధాంత నిబద్ధత, సేవాభావాన్ని ప్రజల్లో నింపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భార తీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యురాలు బండారు రాధిక కోరారు.

జాతీయ, సేవాభావాన్ని బలోపేతం చేయాలి

సిరిసిల్ల అర్బన్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : భారతీయ జనతా పార్టీలో పని చేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జాతీయ భావన, సిద్ధాంత నిబద్ధత, సేవాభావాన్ని ప్రజల్లో నింపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భార తీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యురాలు బండారు రాధిక కోరారు. సిరి సిల్ల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాయలంలో శనివారం పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్‌ 2026 జిల్లాస్థాయి కార్యశాల జిల్లా అధ్య క్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ కౌన్సిల్‌ సభ్యురాలు రాధిక మాట్లాడుతూ కార్యకర్తల్లో జాతీ య భావన, సిద్ధాంత నిబద్ధత సేవాభావాన్ని మరింతగా బలోపేతం చేయడం తోపాటు పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లా లని కోరారు. ఈ కార్యశాలలో జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ఎర్రం మహేష్‌, అల్లాడి రమేష్‌, కరీంనగర్‌ పార్లమెంటరీ కో-కన్వీ నర్‌ అడెపు రవీందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోన్నాల తిరుపతిరెడ్డి, సిరికొం డ శ్రీనివాస్‌,జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బర్కం వెంకటలక్ష్మీ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్న పూర్ణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కౌన్సిలర్లకు ఘన సన్మానం

ఇటీవల జరిగిన సిరిసిల్ల మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలు పొందిన కౌన్సిలర్లు ఊరగొండ లక్ష్మీరాజు, మామిడాల మహేష్‌, కొండ వర్షిణి నరేష్‌, మెరుగు మంజుల శ్రీనివాస్‌, ఎర్రం వెంకట్రాజంలను జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో జాతీయ కౌన్సిల్‌ సభ్యురాలు బండారు రాధిక, జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌ రెడ్డిలు సన్మానించారు.

Updated Date - Feb 22 , 2026 | 12:54 AM