Share News

కక్ష సాధింపు రాజకీయాలకు తావు లేదు

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:52 AM

వేములవాడ ప్రాంతంలో కక్ష సాధింపు రాజకీయాలకు తావు లేదని వేములవాడ ఎమ్మెల్యే, ప్ర భుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

కక్ష సాధింపు రాజకీయాలకు తావు లేదు

వేములవాడ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): వేములవాడ ప్రాంతంలో కక్ష సాధింపు రాజకీయాలకు తావు లేదని వేములవాడ ఎమ్మెల్యే, ప్ర భుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుల్కం రాజు, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌ శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన మున్సి పల్‌ పాలకవర్గానికి శభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కా రమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, ఎన్నికల్లో మున్సిపల్‌ పీఠంపై కాంగ్రెస్‌ జెండా ఎగిరేలా ఆశీర్వదాలు అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణ ప్రజలు కాం గ్రెస్‌ పార్టీకి పాస్‌ మార్కులు ఇచ్చారని, రానున్న రోజుల్లో ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు సాధించేలా నూతన కౌన్సిలర్‌ సభ్యులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న పట్టణంలో సకల వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. గత రెండు సంవ త్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి కొంతమంది కళ్లకు కనబడటం లేద ని ప్రతిక్షాల తీరును ఎండగట్టారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాల కళ్ళకు కనబడేలా వాడవాడలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని కావాలని కొంత మంది ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రతిపక్షాలు చేసే అసత్యపు ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం 70 ఏళ్ల లో చేయని అప్పును కేసీఆర్‌ కేవలం 10ఏళ్లలో చేశారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని, గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల వరద పారు తుందని అన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉండి మూలవాగు బ్రిడ్జి నిర్మాణం, ఆలయ అభివృద్ధి, సూరమ్మ చెరువు పనులపై అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి పనులను ముమ్మరంగా చేస్తున్నామని, త్వరలోనే కలికోట సూరమ్మ చెరువు, మర్రిపల్లి ప్రాజెక్టు పనులు పూర్తి అవుతున్నాయన్నారు. వేములవాడ నుంచి చందుర్తి, రుద్రంగి మీదుగా సిరికొండ వరకు రూ.180 కోట్లతో 100 ఫీట్ల రోడ్డుకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. హనుమాజీపేట నుంచి అజ్మి రాతండా వరకు రూ.25కోట్లు రోడ్డు నిర్మాణం త్వరలో జరగనున్నాయ న్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ కౌన్సిల ర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్నారు.

ప్రజా ప్రభుత్వంతోనే స్వంత ఇంటి కల సాధ్యం...

గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ఆశచూపి పేద ప్రజలన మోసం చేస్తే, ప్రస్తుతం ప్రజా పాల నలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కెటాయించి స్వంత ఇంటి కలను సాకారం చేశామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని 13వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదా రులకు నూతన వస్ర్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీని వాస్‌ మాట్లాడుతూ పట్టణంలో మొదటి విడుతలో ఇందిరమ్మ ఇండ్లు అందించామని, మరికొంత మందికి విడుతల వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటామని అన్నారు. పట్టణంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం చేసుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నా రు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్‌ మూడపల్లి నీలమ్మ, 12వ వార్డు కౌన్సిలర్‌ రామతీర్థపు కృష్ణవేణి-హరీష్‌ నాయకులు సాయిని అం జయ్య, రాజేశం తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:52 AM