Share News

క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు సేవలను అందించాలి

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:57 AM

క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు పోలీసులు సేవలను అందించి మన్నలను పొందాలని అదనపు ఎస్పీ చంద్రయ్య కోరారు.

క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు సేవలను అందించాలి

సిరిసిల్ల అర్బన్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు పోలీసులు సేవలను అందించి మన్నలను పొందాలని అదనపు ఎస్పీ చంద్రయ్య కోరారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం ఎస్పీ మహేష్‌ బీ గీతే ఆదేశాల మేరకు జిల్లా అర్మీడ్‌ రిజర్వీ, సివిల్‌, హోం గార్డు సిబ్బందికి వీక్లీ పరేడ్లను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ నిత్య జీవనంలో వాకింగ్‌, వ్యాయామం చేసుకోవాలన్నారు. సాధ్య మైనంత వరకు బయట ఆహారం తినడం మానుకోవాలన్నారు. రెగ్యులర్‌గా హెల్త్‌ చెకప్‌ చేసుకోవాలని కోరారు. వీక్లీ పరేడ్‌ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ యూనిటీగా ఉండడం ఫిజికల్‌ ఫిట్నెస్‌కి ఉపయోగపడుతుందన్నారు. క్రమ శిక్షణతో డ్యూటీలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. సిబ్బందికి ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడైనా తనను కలిసి తెలియజేయాల న్నారు. ఈ పరేడ్‌లో ఆర్‌ఐలు, సీఐలు కృష్ణ, మధూకర్‌, యాదగిరి, రమేష్‌, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్‌, సాయి కిరణ్‌, జూనైద్‌లు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:57 AM