విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకం
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:51 AM
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని, విద్యార్థులు ప్రణాళికబద్ధంగా ప్రతిఅంశంపై సాధ నచేసి ఉత్తమ మార్కులు సాధించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్ర వాల్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని, విద్యార్థులు ప్రణాళికబద్ధంగా ప్రతిఅంశంపై సాధ నచేసి ఉత్తమ మార్కులు సాధించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్ర వాల్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఉపా ధ్యాయులు, సిబ్బంది హాజరు పట్టిక, పాఠశాల పరిసరాలు, వంటగది, సరుకుల నిల్వగది, ఆహారపదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యాలయంలోని అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు సంబంధించి న వివరాలు అధికారులను అడిగితెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచన లు చేశారు. ఏమైనా సమస్యలున్నాయా..? అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అన్నం దొడ్డుగా ఉండడం వల్ల తినలేకపోతున్నామ ని పేర్కొనడంతో సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. సన్న బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినుల ప్రగతిపై ఆరా తీశారు. సామాన్య శాస్త్రంకు సంబంధించిన ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా ఇన్ చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ విద్యార్థినులు ప్రతి అం శంపై పట్టు సాధించాలన్నారు. ఏకాగ్రతతో అన్ని సబ్జెక్టులను చదవ డం, రాయడం చేయాలన్నారు. గత ప్రశ్నాపత్రాలను సాధన చేస్తూ తప్పొప్పులను సరిచూసుకోవాలన్నారు. పదో తరగతి మార్కులే ఉన్నత విద్యాభ్యాసంలో కీలకంగా మారుతాయన్నారు. పట్టుదలతో చదివి ఉన్న త స్థాయిలో స్థిరపడాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ఆమె వెంట అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.