గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:05 AM
ఐదు రోజులుగా శిక్షణలో తెలుసుకున్న విషయాలను గ్రామాల అభివృద్ధికి వినియోగిం చాలని ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు అన్నారు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఐదు రోజులుగా శిక్షణలో తెలుసుకున్న విషయాలను గ్రామాల అభివృద్ధికి వినియోగిం చాలని ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు అన్నారు. మండల పరిషత్ కార్యాల యంలో ఐదు రోజులుగా జరుగుతున్న మండలంలోని 14 గ్రామాలకు చెందిన వార్డు సభ్యుల శిక్షణలో భాగంగా శనివారం ఎంపీడీఓ మాట్లాడు తు గ్రామ పంచాయతీలకు చెందిన విధులు, పంచాయతీ పద్దుల ద్వారా నిధుల గురించి తెలుసుకున్నారని, వార్డు సభ్యులు తెలుసుకున్న విషయా లను గ్రామాల అభివృద్ధిలో ఉపయోగించాలన్నారు. గ్రామ పంచాయతీల పాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతీ పేద వ్యక్తికి చెందేలా వార్ఢు సభ్యులు బాధ్యత తీసుకో వాలని సూచించారు. వార్డుల్లో ఉన్న ప్రతీ సమస్యలను గ్రామ సభలో చర్చించి పరిష్కారం చూపాలన్నారు. మండల పంచాయతీ అభివృద్ధి అధికారి మౌనిక, కాట్నపల్లి సర్పంచ్ పూజ, శిక్షకులు పాల్గొన్నారు.