Share News

Hyderabad: 24 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు టు కిమ్స్‌..

ABN , Publish Date - Oct 08 , 2025 | 08:41 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి వరకు ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం సాయంత్రం గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేశారు. 24 నిమిషాల వ్యవధిలోనే ఊపిరితిత్తులు ఆస్పత్రికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

Hyderabad: 24 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు టు కిమ్స్‌..

- గ్రీన్‌ చానల్‌ ద్వారా ఆస్పత్రికి ఊపిరితిత్తులు చేరవేత

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport) నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి వరకు ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం సాయంత్రం గ్రీన్‌ చానల్‌(Green Channel) ఏర్పాటు చేశారు. 24 నిమిషాల వ్యవధిలోనే ఊపిరితిత్తులు ఆస్పత్రికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రిలో ఎ.సన్యాసిరావు(67) బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరితిత్తులు దానం చేయడానికి ముందుకొచ్చారు.


city4.2.jpg

సికింద్రాబాద్‌ కిమ్స్‌(Secunderabad KIMS)లో ఉన్న ఓ పేషెంట్‌కు కావాలని డాక్టర్లకు సమాచారం అందించడంతో వైజాగ్‌ నుంచి ఊపిరితిత్తులను ఎయిరిండియా విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న సిబ్బంది శంకర్‌ గణేష్‌, రాజేష్‌, డ్రైవర్‌ అజీజ్‌ వెంటనే ఊపిరితిత్తులను అంబులెన్స్‌లో 24 నిమిషాల్లో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి చేర్చారు. ఆస్పత్రిలో ఉన్న పేషెంట్‌కు అమర్చినట్లు సిబ్బంది చెప్పారు. విమానం దిగగానే నేరుగా అంబులెన్స్‌ వద్దకు చేరుకునేలా కృషి చేసిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


city4.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

Read Latest Telangana News and Nationa

Updated Date - Oct 08 , 2025 | 08:41 AM