Home » Doctor
యూకేలో డాక్టర్ గా పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను మోసం చేసిన వ్యక్తి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి ఆ మహిళ నమ్మించి రూ.3.38 లక్షలకు వసూలు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మహిళ కడుపులోంచి 8 కిలోల కణతిని వైద్యులు గుర్తించారు. నగరంలోని వాసవి ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి ఈ కణతిని తొలగించారు. స్లీవ్ గ్యాస్ర్టెక్టమీ పద్ధ్దతిలో శస్త్రచికిత్స నిర్వహించి ఆ కణితిని తొలగించారు.
పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ బాలుడి కిడ్నీ నిండా రాళ్లు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. అయితే.. ఆ బాలుడి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరంగల్ జిల్లాకు చెందిన బాలుడి కిడ్నీలోకి రాళ్లు చేరాయి.
ముగ్గురు మహిళలకు రోబోటిక్ విధానం ద్వారా శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సింగపూర్, దుబాయ్, భారత్ మహిళలకు గైనకాలజీ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. నగరంలోని కేర్ ఆస్పత్రి గైనకాలజీ బృందం ఈ శస్త్ర చికిత్సలను నిర్వహించారు.
మధుమేహం అనేక అవయవాలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి అని, ప్రధానంగా నేత్రాలపై తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఒక ప్రకటనలో ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యులు తెలిపారు.
వీసా రాకపోవడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ పద్మారావు నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వైద్యురాలు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తాను చనిపోతూ.. మరో ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించింది ఓ వైద్యురాలు. రోహిణి అనే వైద్యురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. బ్రెయిన్ డెడ్ అవడంతో అవయవాలను దానం చేశారు. వాటిని ఐదుగురికి అమర్చారు.
సీవోపీడీ ఊపిరితిత్తులలో అవరోధాన్ని కలిగించే జబ్బు. ముఖ్యంగా చలికాలంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాలుష్యంలో తిరిగే, ఫ్యాక్టరీల్లో పనిచేసే, రసాయనిక, ఆభరణాలకు పూత పూసే వారిలో, స్మోకర్స్, పాసివ్ స్మోకర్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు వివరించారు.
మానవాళికి వరంలా అందివచ్చిన యాంటీబయాటిక్స్.. మన విచ్చలవిడి, విచక్షణ రహిత వినియోగం కారణంగా క్రమంగా శక్తిని కోల్పోతున్నాయి. వైద్యులు చేసన సిఫారసుకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వాడటం, కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేయడం వల్ల బ్యాక్టీరియాలు.. యాంటీ బయాటిక్స్ నిరోధకతను సంతరించుకుని బలంగా మారుతున్నాయి.
అనియంత్రిత మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, ముందస్తు నేత్ర పరీక్షలు జరుపుకుంటే ఈ ముప్పు తప్పించవచ్చునని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి అన్నారు.