‘గాంధీ’లో యువతికి అరుదైన శస్త్ర చికిత్స
ABN , Publish Date - Jan 22 , 2026 | 10:05 AM
నగరంలోని గాంధీ ఆసుపత్రిలో యువతికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి అనే యువతి జన్యుపరమైన వ్యాధితో పాటు తీవ్రమైన గుండెపోటు, శ్వాస సమస్యలతో బాధపడుతోంది. అయితే.. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాన్ని కాపాడారు.
- జన్యుపరమైన సమస్యలతోపాటు గుండెలో రంధ్రం
హైదరాబాద్: జన్యుపరమైన ఈసీ సిండ్రోమ్ వ్యాధి, ఊబకాయం, టైప్ 1 మధుమేహం, మేధో వైకల్యంతోపాటు గుండె సమస్య ఉన్న యువతికి గాంధీ ఆస్పత్రి వైద్యులు(Gandhi Hospital doctors) అరుదైన శస్త్ర చికిత్స చేసిప్రాణాలు కాపాడారు. ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి (25) యువతి జన్యుపరమైన వ్యాధితో పాటు తీవ్రమైన గుండెపోటు, శ్వాస సమస్యలతో బాధపడుతోంది. పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
పరీక్షలు నిర్వహించిఆమెకు బార్లెట్ బీడిల్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యు వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. మానవ జన్యువుల్లో కొన్నింటిలో వచ్చే మార్పుల కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుందని, ఈ ఆటోసోమల్ రిసెసివ్ రుగ్మతగా గుర్తించే ఈ వ్యాధి శరీరంలోని అన్ని అవయవాలను, వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఇంకా ఆమెకు అదనపు వేళ్లు, దృష్టిలోపం, ఊబకాయం, టైప్ 1 మధుమేహం, మూత్రపిండాల్లో అసాధారణతలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు.

దీనికి తోడు ఆమె గుండెలో రంధ్రం, గుండె మెట్రల్ వాల్వ్ ముందు భాగంలో చీలిక ఉన్నట్లు గాంధీ ఆస్పత్రి గుండె, ఊపిరితితుత్ల శస్త్ర చికిత్స విభాగాధిపతి రవీంద్ర తెలిపారు. ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సను డాక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో వైద్యులు త్రిభువన్, హర్షిత, రాజశేఖర్, సుచరిత, సాయి, ప్రసన్న, రవి శ్రీనివాస్, ప్రశాంత్, రాజ్ కుమార్, ఆర్‌ఎంఓ శేషాద్రి, కళ్యాణ్ చక్రవర్తి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని గాంధీ సూపరింటెండెంట్ వాణి అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్
పాలిచ్చే పశువులకు చికెన్, మటన్ వ్యర్థాలు!
Read Latest Telangana News and National News