Home » Adilabad
కేసీఆర్ సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్‌కు మళ్లీ వస్తానని.. రోజంతా సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్‌లో ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతోందని వివరించారు.
అడవుల్లో విస్తారంగా పెరిగే ఇప్ప చెట్ల మీద పూలను మేం తాకం. అవి కింద రాలిపోయిన తరువాతనే ఏరుకుంటాం. చెట్లమీద పూలను తాకితే పులి వస్తుందని మా గోండు గిరిజనులు గట్టిగా నమ్ముతారు. అందుకే కట్టెతో కూడా వాటిని ముట్టుకోరు’’ అంటాడు ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరులో ‘ఆదివాసీ ఆహార కేంద్రం’ నిర్వహిస్తున్న కుమ్రా విఠల్‌రావు.
గుడ్డు ధర కొండెక్కింది. సామాన్యులకు అందుబాటులో ఉండే గుడ్డు ప్రస్తుతం కొండెక్కి కూర్చుంది. ఒక్కె గుడ్డును రూ. 8కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు ఒకింత భారంగానే మారిందని చెప్పవచ్చు. ఇక.. కూరగాయన పరిస్థితి కూడా అలాగే ఉంది. వాటి ధర కూడా అమాంతం పెరిగిపోయింది.
ఇద్దరు యువకులు రీల్స్ చేసే క్రమంలో వినూత్నంగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఏకంగా పోలీసు వాహనంపైనే కన్నేశారు. వాహనం ఖాళీగా ఉండడం చూసి.. తమ షూటింగ్ స్టార్ట్ చేశారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
వ్యవసాయ మంత్రికి రైతన్నలపై ప్రేమ ఉంటే నిన్న(సోమవారం) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేలు ప్రకటించాలని సవాల్ చేశారు కేటీఆర్.
పెన్‌గంగ నది మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో పుట్టి, ఆదిలాబాద్ వైపు తెలంగాణ సరిహద్దుల గుండా ప్రవహిస్తూ, వార్ధా నదిలో కలుస్తుంది. ఆ నదీ తీరంలోని ‘మణియార్ పూర్’లో గంగారామ్‌కు పదెకరాల పొలం ఉంది. నీటి వనరులున్న నేల కావడంతో అన్ని రకాల పంటలు విస్తారంగా పండుతాయి.
గోదారమ్మ మాత్రం శాంతించని పరిస్థితి. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. దీంతో వరదల భయంతో బాసర సరస్వతీ దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ గతేడాది కంటే 60 శాతం తగ్గింది.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.
మోర్లే బుజ్జి బాయి అనే మహిళ పొలం వద్ద పనిచేస్తున్న సమయంలో నీటి కోసం ముగ్గురు పిల్లలు కుంటలోకి దిగారు. కుంటలో లోతు ఎక్కువగా ఉండటంతో.. చిన్నారులు నీటిలోనే మునిగిపోయారు.