Share News

వసంత పంచమి ఎఫెక్ట్.. మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు

ABN , Publish Date - Jan 23 , 2026 | 09:43 AM

వసంత పంచమి సందర్భంగా.. బాసర క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. గురువారం సాయంత్రానికే బాసర భక్తులతో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

వసంత పంచమి ఎఫెక్ట్.. మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు

బాసర(ఆదిలాబాద్): చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదిన వేడుకలకు బాసర(Basara) క్షేత్రం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రానికే తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చా రు. శుక్రవారం ఉదయం నుంచే తమ పిల్లలకు అక్షరాభాస్యం చేయించేందుకు తల్లిదండ్రులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి.


వసతి దొరకక భక్తుల అవస్థలు

భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో బాసరలోని ప్రైవేట్‌ దేవస్థాన సత్రాలన్నీ నిండిపోయాయి. గదులు దొరకని భక్తులు చాలా మంది ఆల య ప్రాంగణాల్లో, చెట్ల కిందనే నిద్రించగా, మరికొందరు వసతి కోసం ని జామాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.


zzzz.jpg

అక్షరాభ్యాస పూజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

భక్తు రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అక్షరాభ్యాస పూజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ రోజుల్లో ఉదయం 7 గంటలకు ప్రా రంభమయ్యే పూజలు, నేడు (శుక్రవారం) ఉదయం 3 గంటలకే ప్రారం భం కానున్నాయి. అక్షర శ్రీకార పూజల కోసం నాలుగు చోట్ల ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. అదనపు పురోహితులను నియమించి, సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా పూజలు జరిగేలా చర్యలు తీసుకున్నారు.


zzzzzz.jpg

అధికారుల పర్యవేక్ష - భారీ బందోబస్తు

నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సాంకేత్‌ కుమార్‌ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.


పాదయాత్రగా తరలివచ్చిన దీక్షాపరులు

ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా బీర్కూరు నుంచి 110 మంది సరస్వతి దీక్షాపరులు పాదయాత్రగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకు న్నారు. వసంత పంచమి రోజైన శుక్రవారం వీరంతా అమ్మవారి సన్నిధిలో దీక్ష విరమించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!

వైసీపీది భూ భక్ష పథకం

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2026 | 09:43 AM