మంచిర్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర నుంచి కూలీలతో వస్తున్న బొలేరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలకు ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కారు సన్నద్ధం అవుతోంది. సహకార సంఘాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీతో ముగిసింది. అయితే వివిధ కారణాల చేత ప్రభుత్వం రెండు దఫాలుగా ఆరు నెలల వ్యవధితో కూడిన గడువు పెంచింది.
మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుగులోత్ శ్రీనివాస్ (35) అనే కౌలు రైతు ఆదివారం ఉదయం పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
జిల్లాలోని మందమర్రిలో గల షెడ్యూల్ ప్రాంతంలో (ఏజెన్సీ) కబ్జాకు గురైన భూమిని కస్టడీకి తీసుకోవాలం టూ ఉట్నూరులోని సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థ (ఐటీడీ ఏ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కునాల గంగాధర్ స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు.
లోక్‌అదాలత్ తీర్పు అంతిమమని జిల్లా అదనపు న్యా యమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ లాల్‌సింగ్ శ్రీనివాసనాయక్ అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రులుగా బరిలోకిదిగి సర్పంచ్లుగా విజయబావుటా ఎగురవేసిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారా...? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని మాతా శిశు సంరక్షణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర సూచించారు.
పట్టణంలోని శిశుమందిర్, మార్కెట్ ఏరియాలోని రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో శనివారం చేపట్టారు.
రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.
సింగరేణిలో పెద్ద పులి సంచరిస్తుండటంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.