శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:29 PM
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైన ఉపేక్షించేదిలేదని మంచిర్యాల డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. శనివారం రామకృష్ణాపూ ర్‌లోని పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావే శంలో మాట్లాడారు.
- మంచిర్యాల డీసీపీ భాస్కర్
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైన ఉపేక్షించేదిలేదని మంచిర్యాల డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. శనివారం రామకృష్ణాపూ ర్‌లోని పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావే శంలో మాట్లాడారు. పోలీసులపై సోషల్ మీడి యాలో జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించవద్దని, పోలీసులు ప్రజల రక్షణ కోస మే ఉన్నారన్నారు. క్యాతన్‌ప ల్లి మున్సిపాలిటిలో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక కార్యక్ర మంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ నాయకుల మధ్య వివాదంలో పోలీసులు చట్టానికి లోబడే పని చేశారే తప్ప ఒక వర్గాని కి, ఒక రాజకీయ పార్టీకి అ నుకూలంగా పని చేయలేదని తెలిపారు. భారతీయ న్యాయ వ్యవస్థకు లోబడి చట్టాన్ని అనుసరించి పోలీసులు పని చేస్తారే తప్ప సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లరని అన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని అనుమానిత వ్యక్తులను కనబడినట్లయితే వందకు సమాచారం అందించాలని సూచించారు. ఆయన వెంట బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ రమేశ్, రామకృష్ణాపూర్ ఎస్‌ఐ శ్రీధర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.