Share News

ప్రజా తీర్పును కాలరాస్తున్న మంత్రి వివేక్‌

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:36 PM

రాష్ట్ర కార్మిక, గను ల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజా తీర్పును కాలరాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామ డుగు లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజా తీర్పును కాలరాస్తున్న మంత్రి వివేక్‌
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌

- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామడుగు లక్ష్మణ్‌

రామకృష్ణాపూర్‌, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కార్మిక, గను ల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజా తీర్పును కాలరాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామ డుగు లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక విషయంలో పోలీసుల కబంద హస్తాలతో బీఆర్‌ఎస్‌, సీపీఐ నాయకులపై దాడులకు పాల్పడి ప్ర మాణ స్వీకారాన్ని రెండు రోజులుగా వాయిదా వేయడం సిగ్గుచే టన్నారు. అంతేగాకుండా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వ్యక్తులను అక్రమ అరెస్టులకు పాల్పడి మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్‌ నాయకులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న క్రమంలో మంత్రి, ఎంపీ అక్కడే ఉన్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మహిళలకు రక్షణ కరువైం దన్నారు. మహిళలతో దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్‌ నాయకులు మంత్రితో కలిసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోరం ఉన్నప్పటికీ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకొనేందుకు విశ్వ ప్రయత్నా లు చేయడం సరికాదన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో మంత్రి వివేక్‌, ఎంపీ వంశీక్రిష్ణపై, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ క్యాతన్‌పల్లిలో దాడులకు పాల్పడుతున్న చర్యలు చేపట్టని పోలీసుల తీరుపై ఆందోళన లు చేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా నాయకులు కాదండి సాంబయ్య, పౌల్‌, వనం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:36 PM