Share News

బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.12.63 లక్షలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:39 PM

బెల్లంపల్లి మండ లం కన్నాల బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరా త్రికి దేవాదాయ శాఖ నిర్వహిం చిన జాతరకు వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు.

బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయ   హుండీ ఆదాయం రూ.12.63 లక్షలు
నగదును లెక్కిస్తున్న ఆలయ నిర్వాహకులు

బెల్లంపల్లి రూరల్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి మండ లం కన్నాల బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరా త్రికి దేవాదాయ శాఖ నిర్వహిం చిన జాతరకు వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఆలయ ఈవో బాపురెడ్డి, కోదండరామా లయ ఈవో ముక్త రవి ఆధ్వర్యం లో హుండీలను తెరిచారు. నగదు ను లెక్కించగా రూ. 4,83,058 వచ్చినట్లు తెలిపారు. అభిషేకంతో రూ.34,900, తైబజార్‌వేలంతో రూ. 3,45,000, దర్శన టికెట్లతో రూ. 3,79,300, కల్యాణకట్టతో రూ. 21,020తో కలిసి రూ. 12,64,278 వచ్చినట్లు అధికా రులు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ. 1,23,909 ఆదాయం అదనంగా వచ్చినట్లు వివరించా రు. ఆలయ భద్రతను తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ, ఆలయ కమిటీ ఛైర్మన్‌ దూడం మహేష్‌, ఉదయ్‌వికాస్‌, రమేష్‌, ఆలయ సిబ్బంది భాను, మఙేష్‌, అర్చకులు వేణుగోపాల్‌ శర్మ, సతీష్‌శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:39 PM