Share News

బాల్క సుమన్ అరెస్ట్.. క్యాతనపల్లిలో ఉద్రిక్త వాతావరణం

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:40 PM

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు.

బాల్క సుమన్ అరెస్ట్.. క్యాతనపల్లిలో ఉద్రిక్త వాతావరణం
Balka Suman

మంచిర్యాల, ఫిబ్రవరి 18: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను (Balka Suman) పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దఎత్తున బాల్క సుమన్ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. అరెస్ట్‌కు సహకరించాలని కోరారు. ఇందుకు మాజీ ఎమ్మెల్యే ససేమిరా అనడంతో బలవంతంగా ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్‌లో తరలించారు. అయితే బాల్క సుమన్‌‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తల ఆందోళనల మధ్యే సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీంతో క్యాతనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


కాగా, క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా నిన్న (మంగళవారం) ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలపై క్యాతనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలివచ్చారు. ఆయన నివాసం చుట్టూ వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుని అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. చివరకు బీఆర్‌ఎస్ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు సుమన్‌ను అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తివేత.. వారిదే నిర్ణయమన్న హైకోర్టు

దారుణం.. భర్తను చున్నీతో ఉరేసి చంపిన భార్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 05:07 PM