బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్
ABN , Publish Date - Feb 18 , 2026 | 07:56 PM
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బాల్క సుమన్‌కు మంచిర్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను ఆదిలాబాద్ జైలుకు తరలించారు.
మంచిర్యాల: మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్‌కు మంచిర్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రిన్సిపల్ జడ్జి ఆదేశాల మేరకు ఆయనను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. పోలీసులు బాల్క సుమన్‌ను క్యాతన్‌పల్లి వద్ద అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం రామకృష్ణాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
ఈ కేసులో బాల్క సుమన్‌ను A1గా, మూల రాజిరెడ్డిని A2గా, అనిల్‌ను A3గా పోలీసులు పేర్కొన్నారు. BNSలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటిలో చట్టవిరుద్ధంగా గుమికూడడం (BNS 189(3)), అల్లర్లు (191(2)), మారణాయుధాలతో అల్లర్లు (191(3)), ఆయుధాలతో గాయపరచడం (118(1)), ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం (324(5)), అలాగే ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడం (223 r/w 190) వంటి సెక్షన్లు ఉన్నాయి.
అరెస్టు అనంతరం బాల్క సుమన్‌ను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ జైలుకు తరలించాలని ఆదేశించారు. ఈ ఘటనతో మంచిర్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండి భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
కాంగ్రెస్ దాడులకు దిగింది: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు
Read Latest Telangana News And AP News