డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ABN , Publish Date - Feb 17 , 2026 | 08:30 PM
డేటా సెంటర్ల భూ సేకరణ పురోగతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు..
హైదరాబాద్, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): డేటా సెంటర్ల భూ సేకరణ పురోగతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) సచివాలయంలో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వివిధ రాష్ట్రాల పాలసీలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. డేటా సెంటర్ల కోసం భూ కేటాయింపులో హేతుబద్ధత ఉండాలని దిశానిర్దేశం చేశారు. భూ పరిహారం నిర్ణయంలో ఉదారంగా వ్యవహారించాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడి సంతృప్తి కలిగేలా పరిహారం ఇవ్వాలని మార్గనిర్దేశం చేశారు. భూమి త్వరగా ఇస్తే కంపెనీలు వేగంగా పనులు పూర్తి చేస్తాయని వివరించారు. వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి ప్రయోజనం పెరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ముంబైకి సీఎం రేవంత్‌రెడ్డి..
మరోవైపు.. సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ముంబై బయలుదేరారు సీఎం రేవంత్‌రెడ్డి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూడు రోజుల పాటు జరిగే ముంబై క్లైమెట్ వీక్‌లో సీఎం రేపు(బుధవారం) పాల్గొననున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముంబై క్లైమెట్ వీక్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు రేవంత్‌రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి, పరిపాలన సంబంధిత అంశాల్లో రాష్ట్ర విజయాలను ఈ వేదికపై రేవంత్‌రెడ్డి వివరించనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు ముంబై క్లైమెట్ వీక్ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో కన్వెక్షన్ సెంటర్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై కార్పొరేషన్ భాగస్వాములుగా ఈ సదస్సు జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు
Read Latest Telangana News And AP News And Telugu News