Share News

మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..

ABN , Publish Date - Feb 17 , 2026 | 03:36 PM

తొర్రూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..
Errabelli DayakarRao

మహబూబాబాద్, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): తొర్రూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli DayakarRao) కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహుల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రబెల్లి భావోద్వేగానికి గురయ్యారు. కష్టపడి పనిచేసిన గులాబీ కార్యకర్తలకు నేను ఏం సమాధానం చెప్పాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పని చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉండాలా.. వద్దా అని ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీరు పెట్టుకున్నారు.


బీఆర్ఎస్‌ శ్రేణుల నిరసన..

మరోవైపు.. తొర్రూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్‌ శ్రేణులు నిరసనకు దిగారు. ఎంపీ కడియం కావ్య ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా అనర్హురాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ తమను బెదిరించారని బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 04:58 PM