పరీక్షలంటే విద్యార్థులు భయం వీడాలి
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:27 PM
విద్యార్థులు పరీక్షలంటే ఎటు వంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు.
జిల్లా విద్యాధికారి యాదయ్య
భీమిని, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పరీక్షలంటే ఎటు వంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో రైతు వేదికలో శనివారం మండలస్థాయి అధికారుల సంఘం ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థు లకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా డీఈవో హాజరై విద్యార్థులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ సంద ర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నాపత్రాలను క్షుణంగా చదివి అర్థం చేసుకొని ప్రతీప్రశ్నకు తప్పనిసరిగా జవాబులు రాయా లని సూచించారు. పరీక్షలు అంటే ఎలాంటి భయము, ఆందోళన చెందవద్దని, విద్యార్థులంతా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి మండలానికి మంచి పేరు తీసుకువాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన మండల స్థాయి అధికారులకు, సుప్రజా పీపుల్స్ ఫర్ పీపుల్ సొసైటీ బెల్లంపల్లి వారిని అభినందించారు. అనంతరం పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాడ్, కంపాస్ బాక్స్, ఐదు పెన్నులు, స్కేల్, పెన్సిల్ వంటి పరీక్ష సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ సబ్జెక్టులపై ప్రత్యేక నిపుణుల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగా మోహన్, తహసీల్దార్ బికర్ణ దాస్, ఎస్సై విజయ్‌కుమార్, ఏఈఓ వెంకటస్వామి, ఏపీఎం బ్రహ్మయ్య, ఏఈపీఆర్ సాయి చంద్, ఏఈ హౌసింగ్ చంద్రశేఖర్, సీహెచ్‌వో జలపతి, ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి, కేజీబీవీ ప్రత్యేకాధికారి దివ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.