Share News

హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!

ABN , Publish Date - Jan 23 , 2026 | 06:40 AM

ఐరోపా దేశాలపై సుంకాలు ఉండవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకు తోడు, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో గురువారం బంగారం ధరలు దిగొచ్చాయి. మరి దేశంలో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!
Gold, Silver Price on Jan 23

ఇంటర్నెట్ డెస్క్: మూడు రోజులుగా అడ్డు, అదుపూ లేకుండా పెరిగిన పసిడి, వెండి ధరలకు గురువారం బ్రేక్ పడింది. ఐరోపా దేశాలపై సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కుతగ్గడంతో ధరలు భారీగా తగ్గాయి. భారత్‌లో పసిడి ధర సుమారు రూ.2200ల మేర, వెండి రూ.5000ల మేర తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం (జనవరి 23) ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,300కు చేరింది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,41,440కు దిగింది. విజయవాడ, వైజాగ్ నగరాల్లో కూడా 24 క్యారెట్, 22 క్యారెట్ పసిడి ధరలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,900 వద్ద తచ్చాడుతోంది (Gold, Silver Rates on Jan 23).

ఇక హైదరాబాద్‌లో వెండి ధర కూడా దిగొచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3,39,900 లక్షలుగా ఉంది. చెన్నై, విజయవాడల్లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. ముంబైలో అత్యల్పంగా కిలో వెండి రూ.3,24,900 పలుకుతోంది.

ఐరోపా దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వెనక్కు తగ్గడంతో పాటు గ్రీన్‌‌లాండ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని చెప్పడంతో మార్కెట్‌లో వెండి, బంగారానికి డిమాండ్ తగ్గింది. దీంతో, పాటూ మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా ధరల తగ్గుదలకు దారి తీసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24కే, 22కే) ధరలు

  • చెన్నై: ₹1,54,900; ₹1,41,990;

  • ముంబై: ₹1,54,300; ₹1,41,440;

  • న్యూఢిల్లీ: ₹1,54,450; ₹1,41,590;

  • కోల్‌కతా: ₹1,54,300; ₹1,41,440;

  • బెంగళూరు: ₹1,54,300; ₹1,41,440;

  • హైదరాబాద్: ₹1,54,300; ₹1,41,440;

  • విజయవాడ: ₹1,54,300; ₹1,41,440;

  • కేరళ: ₹1,54,300; ₹1,41,440;

  • పుణె: ₹1,54,300; ₹1,41,440;

  • వడోదరా: ₹1,54,350; ₹1,41,490;

  • అహ్మదాబాద్: ₹1,54,350; ₹1,41,490;

వెండి (కిలో) ధరలు

  • చెన్నై: ₹3,39,900

  • ముంబై: ₹3,24,900

  • న్యూఢిల్లీ: ₹3,24,900

  • కోల్‌కతా: ₹3,24,900

  • బెంగళూరు: ₹3,24,900

  • హైదరాబాద్: ₹3,39,900

  • విజయవాడ: ₹3,39,900

  • కేరళ: ₹3,39,900

  • పుణె: ₹3,24,900

  • వడోదరా: ₹3,24,900

  • అహ్మదాబాద్: ₹3,24,900


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ఇవీ చదవండి:

ఎన్‌బీఎఫ్‌సీల బంగారం రుణాల ఏయూఎంలు రూ.4 లక్షల కోట్లకు..

రికవరీ బాటపట్టిన మార్కెట్స్

Updated Date - Jan 23 , 2026 | 07:10 AM