సైయెంట్ లాభంలో 25 శాతం క్షీణత
ABN , Publish Date - Jan 23 , 2026 | 02:51 AM
ఇంజనీరింగ్ సర్వీసెస్ సంస్థ సైయెంట్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.92 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇంజనీరింగ్ సర్వీసెస్ సంస్థ సైయెంట్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.92 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 24.9 శాతం (రూ.122.30 కోట్లు) క్షీణించింది. కొత్త కార్మిక చట్టాల అమలు కోసం రూ.42.3 కోట్ల వన్‌టైమ్ కేటాయింపులు చేపట్టటంతో లాభం తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం రెవెన్యూ కూడా 4 శాతం క్షీణించి రూ.1,926.45 కోట్ల నుంచి రూ.1,848.5 కోట్లకు చేరుకుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికం తో పోల్చితే మాత్రం ఆదాయం 3.7 శాతం పెరగగా లాభం మాత్రం 28 శాతం తగ్గింది. త్రైమాసిక కాలంలో డిజిటల్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డీఈటీ) విభాగ రెవెన్యూలు రూ.1,483.30 కోట్లుగా ఉండగా డిజైన్ లెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ (డీఎల్‌ఎం) విభాగ ఆదాయం రూ.303.30 కోట్లుగా ఉంది. సెమీకండక్టర్స్ విభాగ ఆదాయం మాత్రం 26 శాతం క్షీణించి రూ.61 కోట్లుగా నమోదైంది.
ఇవి కూడా చదవండి..
అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..
మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..