Share News

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:39 PM

మా ముక్కుల నుంచి రక్తం కారింది. కొందరు వాంతులు చేసుకున్నారు. చాలా మంది కింద పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మే నిలబడలేకపోయాం. అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే.. నికోలస్ మదురో దగ్గర గార్డ్‌గా పని చేసిన ఓ వ్యక్తి మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..
sonic weapon technology

'మా ముక్కుల నుంచి రక్తం కారింది. కొందరు వాంతులు చేసుకున్నారు. చాలా మంది కింద పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మే నిలబడలేకపోయాం. అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే'.. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో‌ దగ్గర గార్డ్‌గా పని చేసిన ఓ వ్యక్తి మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి (US sonic weapons Venezuela raid).


నికోలస్ మదురో, ఆయన భార్య సిలియాను అరెస్ట్ చేయడానికి అమెరికా సైన్యం ఓ రహస్య ఆయుధాన్ని ఉపయోగించిందని చాలా కథనాలు వచ్చాయి. ఆ కథనాలపై ట్రంప్ తాజాగా స్పందించారు. వెనెజువెలా ఆపరేషన్‌లో సీక్రెట్ సూపర్ సోనిక్ వెపన్‌ను వినియోగించినట్టు తాజాగా ట్రంప్ అంగీకరించారు. ఆ అత్యాధునిక, శక్తివంతమైన ఆయుధం అమెరికా వద్ద మాత్రమే ఉందని, మరొకరి దగ్గర ఈ టెక్నాలజీ లేదని అర్థం వచ్చేలా ట్రంప్ మాట్లాడారు (Trump secret weapon claim).


'ఎవరికీ తెలియని ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది' అని ట్రంప్ పేర్కొన్నారు. వెనెజువెలాపై అమెరికా సైనికులు చేసిన దాడి 'అద్భుతం' అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు (US military innovation). వెనెజువెలాపై అమెరికా ఉపయోగించిన సీక్రెట్ సూపర్ సోనిక్ వెపన్‌ గురించి అంతర్జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్‌

పాలిచ్చే పశువులకు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు!

Updated Date - Jan 22 , 2026 | 03:39 PM