Home » Donald Trump
భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్దాన్ని తానే మధ్యవర్తిత్వం వహించి ఆపినట్లు ట్రంప్ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇప్పుడు అదే బాటలో చైనా నడుస్తోంది.
గత కొంత కాలంగా ఉక్రెయిన్ - రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే పలు దేశాలు శాంతి చర్చలు జరిపినప్పటికీ.. యుద్ధం ఆపలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే జెలెన్స్కీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన కీలక భేటీపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.
గత కొంత కాలంగా ఇజ్రాయెల్-పాలస్తీనా, ఉక్రెయిన్ - రష్యా, ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్దాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియా ఐసీస్ టెర్రరిస్టులపై అటాక్ చేసింది.
ట్రంప్ మళ్లీ పాత పాట అందుకున్నారు. తాను భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. 10 మిలియన్ ప్రాణాలు లేదా అంతకంటే ఎక్కువ రక్షించానని పాక్ ప్రధాని తనకు కితాబిచ్చారని చెప్పుకొచ్చారు..
అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందులో తొలుత ట్రంప్ ఫొటో మాయమవ్వగా.. మరలా ఇప్పుడు ప్రత్యక్షమైంది.
హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో కాలిఫోర్నియాలో టీచర్లకు కొరత ఏర్పడింది. దీంతో, అక్కడి స్కూలు యాజమాన్యాలు ట్రంప్ ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఇప్పటికే కాలిఫోర్నియా ప్రభుత్వం న్యాయ పోరాటం కూడా ప్రారంభించింది.
శ్వేతసౌధం సలహాదారుగా ఉన్న భారత సంతతి టెక్ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఏఐ రంగంలో అమెరికా దూసుకుపోయేలా విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని అన్నారు.
జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్.. అమెరికన్ ఫైనాన్షియర్. ఇతనిపై అనేక లైంగిక ఆరోపణలున్నాయి. న్యూయార్క్లో పుట్టిన ఈయన టీచర్ ఉద్యోగం నుంచి తొలగించగా బ్యాంకింగ్ రంగంలోకి వచ్చి కుభేరుడయ్యాడు..
ఇటీవల విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ప్రస్తావన తక్కువగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ చీకటి కోణం జనాలకు తెలియకుండా చేస్తున్నారంటూ డెమాక్రాట్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఎప్స్టీన్తో అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ, బిజినెస్ నిపుణులు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారంటూ పలు ఆధారాలు బయటపడుతున్నాయి. యూఎస్ హౌస్ డెమొక్రాట్లు ఎప్స్టీన్కు ఎస్టేట్ నుంచి తాజాగా కొన్ని కొత్త ఫొటోలను విడుదల చేశారు