ట్రేడ్ డీల్.. త్వరలో భారత్, యూఎస్ సంయుక్త ప్రకటన!
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:09 PM
వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికా త్వరలో సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం, డీల్‌కు సంబంధించి కీలక వివరాలు వెల్లడికానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: తమ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు భారత్, అమెరికా ఇటీవల ప్రకటించాయి (Ind-US Trade Deal). అయితే, డీల్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు మరో 4-5 రోజుల్లో సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి (India US Joint Statement). ఆ తరువాత, ఈ ఒప్పందంలోని వివరాలపై పూర్తి స్పష్టత రానుంది.
భారత్‌తో ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ప్రకటించారు. ఇందుకు ప్రతిగా భారత ప్రధాని మోదీ (PM Modi) ఎక్స్ వేదికగా అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులు భారత్‌లో పర్యటించనున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరు దేశాల సంయుక్త ప్రకటన తరువాత డీల్‌లోని పూర్తి వివరాలపై స్పష్టత రానుంది. వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేని నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ ఒప్పందంపై ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) కూడా స్పందించారు. డీల్‌కు సంబంధించి తొలి దశ అంశాలపై మార్చి నెలలో ఇరు దేశాలు సంతకాలు చేయనున్నట్టు తెలిపారు. అనంతరం, భారత్‌పై టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని వివరించారు.
భారతీయ వ్యవసాయం (Agriculture), డైరీ ఉత్పత్తుల (dairy), మత్స్య రంగానికి (Fisheries) ఈ డీల్‌లో రక్షణలు (Safegaurds) లభిస్తాయని తెలుస్తోంది. ఈ అంశాలపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డీల్‌లో జాప్యం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక ట్రంప్‌నకు ప్రధాని మోదీ కాల్ చేయకపోవడంతో ఒప్పందం చివరి నిమిషంలో ఆగిపోయిందని అమెరికా మంత్రి లట్నిక్ చెప్పడం మరింత కలకలానికి దారి తీసింది. గతంలో జరిగిన ఇతర వాణిజ్య ఒప్పందాలన్నిటిలో కేంద్రం వ్యవసాయ రంగానికి రక్షణలు దక్కించుకుంది. అమెరికా డీల్‌తో కూడా ఇదే ఒరవడి కొనసాగనుందని సమాచారం.
ఇవీ చదవండి
బిల్‌గేట్స్‌కు లైంగిక సంబంధాలు నిజమే.. మాజీ భార్య మెలిండా వెల్లడి