బిల్‌గేట్స్‌కు లైంగిక సంబంధాలు నిజమే..
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:36 AM
తన భర్త బిల్‌గేట్స్ వేరే మహిళలతో సన్నిహితంగా ఉంటున్నారని తెలిసిన తర్వాతే ఆయనకు విడాకులు ఇచ్చానని మెలిండా గేట్స్ తాజాగా వెల్లడించారు...
అందుకే విడాకులు ఇచ్చేశా: మెలిండా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: తన భర్త బిల్‌గేట్స్ వేరే మహిళలతో సన్నిహితంగా ఉంటున్నారని తెలిసిన తర్వాతే ఆయనకు విడాకులు ఇచ్చానని మెలిండా గేట్స్ తాజాగా వెల్లడించారు. ఆ విషయం తెలిసినప్పుడు ఎంతో వేదనను అనుభవించానని చెప్పారు. చివరికి వివాహ బంధం నుంచి బయటకు వచ్చానన్నారు. తద్వారా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో గేట్స్ గురించి ఉన్నది నిజమేనని ఆమె ఒప్పుకొన్నారు. మెలిండా గేట్స్ ఇటీవల ఓ పాడ్‌కా్‌స్టలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు ఉండటంపై ఆమెను ప్రశ్నించారు. బిల్‌గేట్స్‌కు రష్యా అమ్మాయిలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని, ఫలితంగా సుఖవ్యాధులు వచ్చాయని, ఆయన తన భార్య మెలిండాకు తెలియకుండా ఆమెకు డ్రగ్స్ ఇవ్వడానికి ప్రయత్నించారని ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న వివరాలనూ ప్రస్తావించారు. దీనికి మెలిండా పై విధంగా స్పందించారు. ‘‘వాటి గురించి నన్ను అడగడం అంటే మానని గాయాలను మళ్లీ రేపడమే. నిజం తెలిసినప్పుడు నేను నమ్మలేకపోయా. బిల్‌గేట్స్‌తో వైవాహిక బంధంలో నేను ఎంతో క్షోభపడ్డాను. ఇది నిజం’’ అని చెప్పారు. బిల్‌గేట్స్, మెలిండా 27ఏళ్లు వివాహబంధంలో ఉన్నారు. 2021లో మే నెలలో విడాకులు తీసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు.