Share News

ఎయిర్ ఫోర్స్ వన్‌లో నేను నిద్రపోను: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Feb 06 , 2026 | 09:31 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 గంటల విమాన ప్రయాణంలోనూ అస్సలు నిద్రపోరట. అలర్ట్‌గా ఉండి, ఆ 20 గంటల పాటు కిటికీ బయటకు చూస్తూ ఉంటారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.

ఎయిర్ ఫోర్స్ వన్‌లో నేను నిద్రపోను: డొనాల్డ్ ట్రంప్
US President Donald Trump

ఇంటర్‌నెట్ డెస్క్: సాధారణంగా బస్సు, రైలు లేదా విమాన ప్రయాణాల్లో ఉన్నపుడు చాలా మంది నిద్రపోతూ ఉంటారు. కనీసం అరగంట సమయం దొరికినా కునుకు తీస్తుంటారు. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం 20 గంటల విమాన ప్రయాణంలోనూ అస్సలు నిద్రపోరట. అలర్ట్‌గా ఉండి, ఆ 20 గంటల పాటు కిటికీ బయటకు చూస్తూ ఉంటారట. ఈ విషయాన్ని స్వయంగా డొనాల్డ్ ట్రంప్‌యే చెప్పారు. గురువారం జరిగిన నేషనల్ ప్రేయర్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘నేను విమానాల్లో నిద్రపోను. విమానాల్లో నిద్రపోవటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కిటిలో నుంచి మిస్సైల్స్ ఏమైనా వస్తున్నాయా అని చూస్తా ఉంటా’ అని అన్నారు. మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఇరాక్‌లో పర్యటించారు. ఆ పర్యటన సందర్భంగా నాడు జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.


అధికారులు ట్రంప్ దగ్గరకు వెళ్లి.. ‘సార్.. మీరు నిద్రపోవాలనుకుంటే వెళ్లి నిద్రపోండి. ఇది 20 గంటల పర్యటన. మీ కోసం క్వార్టర్స్ సిద్ధం చేశాం’ అని అన్నారట. ఇందుకు ట్రంప్ సమాధానం ఇస్తూ.. ‘నాకు నిద్ర అవసరం లేదు. నేను విమానాల్లో నిద్రపోను’ అని చెప్పారట. 2016 ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ నిద్ర గురించి మాట్లాడుతూ.. ‘నేను పెద్దగా నిద్రపోను. మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతాను’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

పుట్టుకతో చూపులేని బాలుడికి కంటి వెలుగు

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

Updated Date - Feb 06 , 2026 | 12:52 PM