పుట్టుకతో చూపులేని బాలుడికి కంటి వెలుగు
ABN , Publish Date - Feb 06 , 2026 | 08:46 AM
కంటి చూపు లేకుండా పుట్టిన శిశువుకు వైద్యులు చికిత్స నిర్వహించి కంటి చూపును ప్రసాదించారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల డాక్టర్లు కంటి చూపు తెప్పించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో ‘కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’
హైదరాబాద్ సిటీ: పుట్టుకతో రెండు కళ్లు కనిపించని నెలల శిశువుకు ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల(LV Prasad Eye Hospital) డాక్టర్లు కంటి చూపు తెప్పించారు. చెకోస్లోవేకియా దేశానికి చెందిన 3 నెలల బాలుడు ఇమాద్ ‘పీటర్స్ అనోమలీ’ అనే అరుదైన కంటి సమస్యతో బాధపడుతున్నాడు. బాలుడికి కంటి సమస్య కారణంగా కనుపాపలు పూర్తిగా తెల్లగా ఉండి, చూపు లేకుండా పోయింది. దీంతో వైద్యులు ఇటీవల రెండు కళ్లకు ‘కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ (నల్ల గుడ్డు మార్పిడి శస్త్ర చికిత్స) నిర్వహించారు. ఎడమ కన్ను మరింత క్లిష్టంగా అందులో గ్లకోమా సమస్య కూడా ఉంది.
దీనిని అదుపు చేసేందుకు ‘ట్రాన్స్‌స్క్లెరల్ సైక్లో ఫోటో కోగ్యులేషన్’ అనే పద్ధతిని ఉపయోగించారు. సర్జరీ తర్వాత శిశువులో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, వస్తువులను గుర్తుపట్టడం, చూపును స్థిరంగా ఉంచడం వంటి సానుకూల లక్షణాలు కనిపిస్తున్నాయని ఆ ఆస్పత్రి పీడియాట్రిక్ కార్నియా నిపుణులు మురళీధర్ రామప్ప తెలిపారు. రెండు దశాబ్దాలుగా యాభైకి పైగా దేశాల నుంచి వచ్చిన ఇటువంటి క్లిష్టమైన కేసులకు విజయవంతంగా చికిత్స చేసినట్లు ఎల్వీపీఈఐ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి.
సినిమాలు తక్కువ.. గాసిప్స్ ఎక్కువ
భాస్కరా అవార్డులాగా కేసీఆర్‌కు జాతిపితనా..!
Read Latest Telangana News and National News