భాస్కరా అవార్డులాగా కేసీఆర్‌కు జాతిపితనా..!
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:15 AM
కేసీఆర్‌కు జాతిపిత అంటూ హరీశ్‌రావు బిరుదు ఇవ్వడం.. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం తనకు తానే భాస్కరా అవార్డును ఇచ్చుకున్నట్లే ఉంది...
సీఎం దెబ్బతో డ్రామాలన్నీ పటాపంచలు: ఆది
మనుషులను బట్టి సీఎం భాష: చామల
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘కేసీఆర్‌కు జాతిపిత అంటూ హరీశ్‌రావు బిరుదు ఇవ్వడం.. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం తనకు తానే భాస్కరా అవార్డును ఇచ్చుకున్నట్లే ఉంది’ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. హరీశ్ తన మామకు బిరుదు ప్రదానం చేస్తే ప్రజలంతా చప్పట్లు కొట్టాలా అని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఈ జాతిపిత డ్రామాలను సీఎం రేవంత్ ఒక్క దెబ్బ తో పటాపంచలు చేశారని, ఆయన దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతోందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్‌ఎస్ నేతల బండారాన్ని సీఎం ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారన్నారు. బూతుపిత ఎవరు, జాతిపిత ఎవరన్నది తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. బూతు పదాలకు నాయకుడు ఎవరని గూగుల్‌లో కొడితే కేసీఆర్ పేరే వస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎక్స్ వేదికగా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్.. గతంలో కేసీఆర్ ఎలాంటి భాష వాడారో యూట్యూబ్ చూసి తెలుసుకోవాలన్నారు. సీఎం భాష.. మనుషులను బట్టే ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ దొంగలముఠా మాట్లాడే చిల్లర మాటలను ప్రజలు పట్టించుకోవద్దని, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి చెందాలంటే కాంగ్రె్‌సనే గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మునిసిపల్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలే ఎక్కువగా జరిగాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్‌యాదవ్ అన్నారు. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛ ను ఇచ్చిందని, ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.