దయచేసి మా దేశంపై దాడి చేయండి.. ట్రంప్‌ను అభ్యర్థించి ఇరాన్ వ్యక్తి ఆత్మహత్య..
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:05 PM
ఇరాన్‌తో అమెరికా చర్చలు జరపకూడదని, వీలైనంత త్వరగా దాడి చేయాలని కోరుతూ ఇరాన్‌కు చెందిన ఓ వ్యక్తి వీడియో ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు విజ్ఞప్తి చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
తమ దేశంతో అమెరికా చర్చలు జరపకూడదని, వీలైనంత త్వరగా దాడి చేయాలని ఇరాన్‌కు చెందిన ఓ వ్యక్తి వీడియో ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు విజ్ఞప్తి చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇరాన్‌పై అమెరికా దాడి చేయడమే సరైన మార్గమని అతడు వీడియోలో పేర్కొన్నాడు. ఆ వ్యక్తిని ఇరాన్‌లోని బుషెహర్ నగరానికి చెందిన పౌర హక్కుల కార్యకర్త పౌరియా హమీదీగా గుర్తించారు (Iran man video appeal).
'ఈ వీడియో మీరు చూసే సమయానికి నేను బతికి ఉండకపోవచ్చు. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను చాలా ఘోరంగా అణిచివేశారు. దాదాపు 40 వేల మందిని ఇరాన్ నాయకులు హత్య చేశారు. విదేశీ జోక్యంతోనే ఇరాన్ నాయకులను అడ్డుకోగలం. ప్రస్తుతం అమెరికాను ఎంతగానో నమ్ముతున్నాం. ఇరాన్‌తో సంప్రదింపులు వద్దు. మా దేశంపై దాడి చేయండి. అలా కాదని ఇరాన్‌తో చర్చలు జరిపితే.. మమ్మల్ని అమెరికా మోసం చేసినట్టే అవుతుంది' అని హమీదీ ఆ వీడియోలో పేర్కొన్నాడు (message to Trump video).
ప్రస్తుతం ఒమన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి (viral Iran video). మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక మోహరింపు కూడా పెరుగుతోంది. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు విఫలమైతే దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అమెరికా సంకేతాలు పంపుతోంది. ఈ నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి..
కెనడాకు వార్నింగ్.. ఆ వంతెనను బ్లాక్ చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడి బెదిరింపు..