Share News

కెనడాకు వార్నింగ్.. ఆ వంతెనను బ్లాక్ చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడి బెదిరింపు..

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:04 AM

అమెరికా నుంచి ఇప్పటివరకు పొందిన అన్ని ప్రయోజనాలకు ప్రతిఫలంగా తమకు తగిన మూల్యం చెల్లించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు.

కెనడాకు వార్నింగ్.. ఆ వంతెనను బ్లాక్ చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడి బెదిరింపు..
US Canada bridge dispute

అమెరికా నుంచి ఇప్పటివరకు పొందిన అన్ని ప్రయోజనాలకు ప్రతిఫలంగా తమకు తగిన మూల్యం చెల్లించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో ఇటీవల ఇరు దేశాల మధ్య విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. పైగా, చైనాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కెనడా ఆసక్తి చూపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాపై ట్రంప్ విరుచుకుపడ్డారు (Trump warns Canada).


'మాకు తగిన పరిహారం చెల్లించకుంటే అమెరికా-కెనడా మధ్య డెట్రాయిట్ నదిపై ఏర్పాటు చేసిన గోర్డీ హోవే అంతర్జాతీయ వంతెన ప్రారంభాన్ని అడ్డుకుంటాం. 2014లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలివి తక్కువగా ఆలోచించి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన మినహాయింపులు ఇచ్చారు. వంతెన నిర్మాణానికి అయిన ఖర్చులో సగమైనా అమెరికాకు చెల్లించాలి. లేదా, ఇరు దేశాలకు గోర్డీ హోవే వంతెనపై సమాన యాజమాన్య హక్కులు ఉండేలా చర్యలు తీసుకోవాలి' అని ట్రంప్ డిమాండ్ చేశారు (US Canada bridge dispute).

trump2.jpg


కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌ను అమెరికాలోని మిచిగాన్‌తో కలుపుతూ నిర్మించిన గోర్డీ హోవే ఇంటర్నేషనల్ బ్రిడ్జ్‌ను (Cross border bridge news) కెనడా ప్రభుత్వానికి చెందిన విండర్స్-డెట్రాయిట్ బ్రిడ్జ్ అథారిటీ అనే సంస్థ నిర్మించిందని, ఈ ప్రాజెక్టుకు అయిన మొత్తం ఖర్చును కెనడా ప్రభుత్వమే భరించిందని ఆ వంతెన ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఈ బ్రిడ్జ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 10 , 2026 | 11:52 AM