పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:35 PM
పానిక్ అటాక్ అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? దానిని ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చాలా మందికి పానిక్ అటాక్స్ వస్తున్నాయి. కానీ చాలా మంది దీనిని చిన్న ఆందోళనగా భావించి పట్టించుకోరు. నిజానికి, పానిక్ అటాక్‌ని తొందరగా గుర్తిస్తే సరైన చికిత్స తీసుకుని, త్వరగా కోలుకోవచ్చు. అయితే అసలు పానిక్ అటాక్ అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? దానిని ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పానిక్ అటాక్ అంటే ఏమిటి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం, పానిక్ అటాక్ అంటే ఒక్కసారిగా తీవ్రమైన భయం, గుబులు, ఆందోళన రావడం. ఇది కొన్ని నిమిషాల నుంచి అరగంట వరకూ ఉండొచ్చు. ఆ సమయంలో మనకు మనపై నియంత్రణ లేకపోయినట్టు అనిపిస్తుంది.
పానిక్ అటాక్ ఎందుకు వస్తుంది?
ఎక్కువ మానసిక ఒత్తిడి
అతిగా ఆలోచించడం
భయంకరమైన అనుభవాలు
దీర్ఘకాలిక టెన్షన్
కొన్నిసార్లు కుటుంబ వారసత్వ కారణాలు
కొంతమందికి స్పష్టమైన కారణం లేకుండానే కూడా పానిక్ అటాక్ రావచ్చు.
పానిక్ అటాక్ లక్షణాలు
పానిక్ అటాక్ లక్షణాలు ఒక్కసారిగా మొదలవుతాయి. ఉదాహరణకు:
గుండె వేగంగా కొట్టుకోవడం
శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం
ఛాతీలో బిగుతు
తల తిరగడం
చేతులు, కాళ్లు వణకడం
ఎక్కువగా చెమట పడటం
మూర్ఛ వస్తుందేమో అన్న భయం
చనిపోతామేమో అన్న ఆలోచన
ఈ లక్షణాలు కొంతసేపటికి తగ్గిపోతాయి కానీ మనసుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
పానిక్ అటాక్ రాకుండా ఉండాలంటే?
ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి
రోజూ కొంచెం వ్యాయామం లేదా యోగా చేయండి
7- 8 గంటలు నిద్రపోండ్
కాఫీ, టీ లాంటివి ఎక్కువగా తాగొద్దు
గుబులుగా అనిపించినప్పుడు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోండి
సమస్య మళ్లీ మళ్లీ వస్తే తప్పకుండా మానసిక వైద్యుడిని సంప్రదించండి
పానిక్ అటాక్ ఒక వ్యాధి కాదు, కానీ సరైన శ్రద్ధ అవసరమైన సమస్య. భయపడకుండా సరైన సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు
ఈ వార్తలు కూడా చదవండి.
హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!
Read Latest Telangana News and National News