Share News

గ్లోబల్ వేదికపై భారత్ స్థానం మరింత బలోపేతం: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Feb 03 , 2026 | 08:24 AM

కేవలం ఒక వారంలోనే రెండు ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన ఉత్తేజాన్ని అందించారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

గ్లోబల్ వేదికపై భారత్ స్థానం మరింత బలోపేతం: పవన్ కల్యాణ్
Pawan Kalyan

అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడంలో ఈవారం అత్యంత కీలకమైనదిగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నేతృత్వంలో కుదిరిన రెండు ప్రధాన ఒప్పందాలు దేశ ఎగుమతుల ముఖచిత్రాన్ని మార్చనున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ పెట్టారాయన.


యూరోపియన్ యూనియన్ (EU) తో 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'..

గత వారం కుదిరిన ఈ ఒప్పందం యూరప్ మార్కెట్లలో భారతీయ వస్తువులకు భారీ ప్రాధాన్యతను కల్పిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇది కేవలం వాణిజ్యమే కాకుండా, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా బలోపేతం చేస్తుందని చెప్పుకొచ్చారు.


అమెరికా అధ్యక్షుడితో చారిత్రాత్మక ఒప్పందం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కుదిరిన తాజా ఒప్పందం భారతీయ వ్యాపారులకు, ముఖ్యంగా రైతులకు వరప్రదాయినిగా మారనుందని పవన్ కల్యాణ్ తెలిపారు.

సుంకాల తగ్గింపు: సుంకాల (Tariffs) ఛార్జీలను 18 శాతానికి తగ్గించడం ద్వారా అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల ధరలు తగ్గి, పోటీతత్వం పెరుగుతుందని వివరించారు.

రైతులకు ప్రయోజనం: వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం వల్ల రైతుల ఆదాయం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు


ఈ వార్తలు కూడా చదవండి..

ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు

నేరమయ రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం.. జగన్ అండ్ కోపై సీఎం చంద్రబాబు ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 01:59 PM