రాజకీయాలను నేరమయం చేయడమే వైసీపీ సిద్ధాంతం.. జగన్ అండ్ కోపై సీఎం చంద్రబాబు ఫైర్
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:55 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరోసారి రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు, శాంతిభద్రతల అంశం, పాలనలో మార్పులు వంటి విషయాలపై సీఎం చంద్రబాబు చేసిన తాజా ట్వీట్ చర్చకు దారితీసింది.
అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరోసారి రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు, శాంతిభద్రతల అంశం, పాలనలో మార్పులు వంటి విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) చేసిన తాజా ట్వీట్ చర్చకు దారితీసింది. వైసీపీపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేక వైసీపీలో ఫ్రస్టేషన్ పెరిగిందని చంద్రబాబు విమర్శించారు.
రాజకీయాలను నేరమయం చేయడమే వైసీపీ సిద్ధాంతమని, వారి పాలనలో చట్టవిరుద్ధ పాలనకు అనేక ఉదాహరణలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. జగన్ హయాంలో చట్టాన్ని పక్కనపెట్టి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన అనేక అక్రమాలు, చట్టవిరుద్ధ చర్యలే దీనికి నిదర్శనమని ప్రస్తావించారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ జగన్ పాలన కొనసాగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
2024 తర్వాతే ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు..
సీఎం చంద్రబాబు తన ట్వీట్‌లో రూల్ ఆఫ్ లా గురించి ప్రధానంగా ప్రస్తావించారు. 2024 తర్వాతే రాష్ట్రంలో నిజమైన చట్టపాలన అమలవుతోందని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో చట్టం పేరుకే ఉండేదని అధికారమే అన్నింటికీ ఆధారంగా మారిందని విమర్శించారు. ప్రజలకు న్యాయం అందాలంటే రాజ్యాంగమే సుప్రీమ్‌గా ఉండాలని, అదే తమ ప్రభుత్వ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదని, అది ఏ పార్టీకి చెందిన వారైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు.
శాంతిభద్రతల పునరుద్ధరణ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని చంద్రబాబు అభివర్ణించారు. గతంలో క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితిని పునరుద్ధరించామన్నారు. ప్రజల భద్రత, ప్రశాంత వాతావరణం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఉద్ఘాటించారు. శాంతిభద్రతలను ఉల్లంఘించే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు.
వైసీపీలో అసహనం..
రాష్ట్రంలో జరుగుతున్న పున: నిర్మాణ ప్రక్రియను చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని సీఎం విమర్శించారు. వారు విధ్వంసం చేసిన వ్యవస్థలను మళ్లీ నిర్మిస్తున్న తీరును చూసి అసహనంతో దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు సేవ చేయడం, వారికి సాధికారిత కల్పించడమే తమ ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
ప్రజాసేవే లక్ష్యం..
ప్రజలకు సేవ చేయటం, వారికి సాధికారిత కల్పించటమే తమ ప్రభుత్వ సిద్ధాంతమని తెలిపారు. పాలనలో పారదర్శకత, చట్టబద్ధత, బాధ్యతాయుత పాలన తమ లక్ష్యాలని స్పష్టం చేశారు. వైసీపీ నిజ స్వరూపం ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతోనే ఆ పార్టీ నాయకులు అసహనంతో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ
చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News